టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా ఒక్కసారిగా వెలిగింది. అప్పట్లో ఆమె క్రేజ్, ఫామ్ చూసినోళ్లంతా పదేళ్ల పాటు ఆమెకు తిరుగు ఉండదనే అనుకున్నారు. అసలు వరుస పెట్టి ఎన్టీఆర్, బన్నీ, మహేష్, చెర్రీ నుంచి ఇటు మీడియం రేంజ్ హీరోలు సందీప్‌కిషన్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలతో వరుస పెట్టేసి సినిమాలు చేసింది. అటు కోలీవుడ్‌లో కార్తీ పక్కన ఖైదీ లాంటి హిట్ సినిమాలోనూ నటించింది
ఇక గోపీచంద్ లాంటి హీరోలతో కూడా నటించి సూపర్ హిట్లు కొట్టింది. అసలు ఆ టైంలో ఆమె వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో పాటు ఆమె రెమ్యునరేషన్ కూడా మామూలుగా ఉండేదే కాదు.
పదేళ్లు ఆమెను టాలీవుడ్‌లో ఢీ కొట్టే హీరోయిన్నే ఉండదని అనుకున్నారు. అయితే సడెన్‌గా ఆమె కెరీర్ యేడాదిలో తిరగబడింది.
చివరకు ఐటెం సాంగులు చేసుకునే కాడకు దిగజారిపోయింది. అసలు గోల్డెన్ లెగ్ కాస్తా ఐరెన్‌లెగ్ అయిపోయింది. కెరీర్‌లో బాగా స్ట్రగుల్ అవుతోన్న టైంలో ఆమె చిన్న చిన్న హీరోలతో కూడా సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత ఆమె టాలీవుడ్ నుంచి పూర్తిగా ఫేడవుట్ అయిపోయింది. ఇందుకు ఆమె చేసిన రెండు సినిమాలే ఎఫెక్ట్ అయ్యాయన్నది ఓపెన్ సీక్రెట్.
ముందుగా ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అవ్వడానికి మహేష్‌తో చేసిన స్పైడర్. ఆ సినిమాలో ఆమె కాస్త బోల్డ్‌గా కనిపించింది. అయితే మహేష్ హీరో, మురుగదాస్ డైరెక్టర్ కావడంతో అసలే కథేంటి ? తన రోల్ ఏంటన్నది తెలుసుకోకుండానే ఆమె ఆ సినిమా చేసేసింది. ఆ సినిమాలో ఆమె మహేష్ పక్కన సూట్ కాలేదన్న విమర్శలు వచ్చాయి.
లుక్స్ కూడా సెట్ కాలేదు. సినిమాలో ఆమె నటనపై కూడా బాగా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె తనకంటే వయస్సులో చాలా పెద్దోడు అయిన సీనియర్ ముసలి హీరో నాగార్జునతో మన్మథుడు 2 సినిమా చేసింది. ఆ సినిమాలో ఆమె బోల్డ్ రోల్‌తో పాటు నాగార్జునతో లిప్‌కిస్ చేయడంతో ఆమె ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ దెబ్బతో ఆమెకు ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వలేదు. అలా రకుల్ టాలీవుడ్ నుంచి అవుట్ అయిపోయింది.