నాగార్జునకు కెరీర్ స్టార్టింగ్‌లో వచ్చిన తొలి బ్లాక్‌బస్టర్ సినిమాలలో ఆఖరు పోరాటం సినిమా ఒకటి. ఈ సినిమా నాగార్జున కెరీర్ టర్న్ చేసింది. 1988లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత చలసాని అశ్వనీదత్ నిర్మించారు. నాగార్జున – అశ్వనీదత్ కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు వస్తే ఆఖరు పోరాటం సినిమా మొదటది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా వెనక కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు ఉన్నాయి.
ఈ సినిమా స్టోరీ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్. ఆయన ఓ రోజు ఆఫీసులో కూర్చొని ఉండగా అశ్వనీదత్ ఆయన ఆఫీసుకు వెళ్లారు. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పమని అడిగారు. ఈ కథ చెప్పిన వెంటనే ఇంట్రస్టింగ్‌గా ఉందే అంటూ ఆయన్ను వెంట పెట్టుకుని రాఘవేంద్రరావు దగ్గరకు తీసుకువెళ్లారు. కథ విన్న వెంటనే రాఘవేంద్రరావు చిన్న చిన్న మార్పులు చేయడంతో పాటు ఈ కథ నాగార్జునకు బాగా సెట్ అవుతుందని చెప్పారు.
వెంటనే నాగార్జునకు కథ చెప్పడం.. నాగ్ ఓకే చేయడం.. సినిమా చేయడం చకచకా జరిగిపోయాయి. సినిమాలో మరో ఇంట్రస్టింగ్ ఏంటంటే తన తండ్రి నాగేశ్వరరావుకు జోడీగా ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీదేవి ఈ సినిమాలో నాగ్‌కు జోడీ కట్టింది. సుహాసిని మరో హీరోయిన్గా నటించింది. మెయిన్ విలన్‌గా అమ్రీష్‌పురి నటించగా, కైకాల సత్యనారాయణ కూడా మరో కీ రోల్లో నటించారు.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు నాగార్జున కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. అయితే ఈ కథను రచయిత యండమూరి ముందుగా చిరంజీవికి వినిపించారు. ఈ కథ విన్న చిరు అసలు ఇందులో ఏం కథ ఉందని.. దీనిని సినిమాగా తీస్తే ఎవరు ? చూస్తారని అన్నారు. చివరకు ఈ కథ అశ్వనీదత్ ద్వారా రాఘవేంద్రరావు నుంచి నాగార్జునకు వెళ్లింది. అలా చిరు వదులుకున్న బ్లాక్‌బస్టర్ నాగ్ ఖాతాలో పడింది.