ఇదో పెద్ద స్టోరీ. తెలుగు ఇండస్ట్రీలో అన్నగారు.. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులు పెద్దగా పుంజుకోని సమయంలో.. వారు అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సమయంలోనూ.. ఇప్పటికే సినీ ఇండస్ట్రీని ఏలు తున్న వారు ఎవరు అంటే.. అందరి చూపులూ.. పేకేటి శివరావు వైపే చూపించేవారు. విజయవాడ వన్ టౌన్ ప్రాంతానికి చెందిన శివరావు.. సినీ ఇండస్ట్రీలో చాలా వేళ్లూనుకున్న నటుడు.
నాటకాల నుంచి.. సినిమా రంగంలోకి వెళ్లి.. చెన్నైలో ఒక వెలుగు వెలిగారు. ఆయనేమీ.. అందంగా.. హుం దాగా.. చూడగానే ముచ్చట గొలిపే వర్చస్సుతో ఉండరు. పీక్కుపోయిన బుగ్గలు.. లోతుల్లోకి చొచ్చుకుపో యిన కనుగుడ్లు, ఎముకలు కనిపించే దేహం.. ఇవీ టూకీగా చెప్పాలంటే.. పేకేటి శివరావు గురించి చెప్పే కీలక విషయాలు. అయినప్పటికీ.. ఆయనకు హీరోగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా ఆరోజుల్లో శ్రీరంజని-పేకేటి శివరావు జంటగా నటించారంటే.. ఆ సినిమా ఏడాది ఆడాల్సిందే. దీనికి తిరుగులేదు. అనేక సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అయితే. వారిమధ్య ప్రేమ ఉందని.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారనికూడా.. పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అయితే.. అప్పటి అగ్ర నటులు.. క్యారెక్టర్ ఆర్టిస్టు.. గోవింద రాజుల సుబ్బారావు.. వీరిని విడదీశారని అంటారు.
దీనికి కారణం.. పేకేటి శివరావు.. గోవింద రాజుల సుబ్బారావుకు వరుసకు మేనల్లుడు. దీంతో పేకేటి జీవితంలో పెళ్లే చేసుకోకుండా.. ఉండిపోయారని.. సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ ప్రేమ విఫలం కావడంతో.. ఆయన మద్యానికి బానిస అయ్యారని.. ఇదే సమయంలో అవకాశాలు కూడా తగ్గిపోయాయని అంటారు. మొత్తానికి శ్రీరంజని విషయంలో పేకేటి శివరావు సర్వం కోల్పోయారని అంటారు