తెలుగు సినిమాను ఓ రేంజ్‌లో నిలిపారు కళాతపస్వి కె. విశ్వనాథ్. ఆయన సినిమాలలో అచ్చ తెలుగుదనం ఎలా ఉట్టిపడుతుందో తెలిసిందే. కె. విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. ఆయన గుంటూరులోని హిందూ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదివారు. డిగ్రీ అవ్వగానే ఏం చేయాలన్న చర్చ వచ్చినప్పుడు వాళ్లకు తెలిసిన వాళ్లు మద్రాస్‌లో వాహిని స్టూడియో ఏర్పాటు చేస్తున్నారు. అందులో జాయిన్ అవుతానని విశ్వనాథ్ వాళ్ల తండ్రికి చెప్పిన వెంటనే అందుకు ఆయన ఓకే చెప్పారు
ముందు సౌండ్ ఇంజనీర్‌గా విశ్వనాథ్ కెరీర్ సినిమా రంగంలో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావుతో పాటు ఆయన కాంపౌండ్ మెంబర్స్‌తో విశ్వనాథ్‌కు ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది. అది ఆయన కెరీర్‌కు ఎంతో హెల్ఫ్ అయ్యింది. ఏఎన్నార్ మూగమనసులు సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు. విక్టరీ మధుసూధన్‌రావు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు.
ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోకి ఎంటర్ అయ్యారు. ఇక కెరీర్ స్టార్టింగ్‌లో విశ్వనాథ్ ఏఎన్నార్ కాంపౌండ్ మనిషి అన్న ముద్ర పడడంతోనే రామారావు గారితో తాను తక్కువ సినిమాలు చేశానని ఓ సందర్భంలో చెప్పారు. అయితే రామారావు గారు తనతో చాలా బాగా ఉండేవారని.. తనను ఎప్పుడూ బ్రదర్ అని పిలవడంతో పాటు అప్యాయంగా చూసుకునేవారని.. తాను కూడా ఆయన్ను బ్రదర్ అని పిలిచేవాడిని అని విశ్వనాథ్ తెలిపారు.
ఇక ఆయన కెరీర్‌లోనే మైల్‌స్టోన్ సినిమాగా నిలిచిన శంకరాభరణం సినిమాను ఎవ్వరూ కొనేందుకు ముందుకు రాలేదట. అసలు ఆ సినిమా తమిళ్ హక్కులు ఎవ్వరూ కొనలేదు సరికదా ? అట్టర్ ప్లాప్ అవుతుందని ఎగతాళి చేశారట. అయితే అప్పుడు నటి మనోరమ రు. 50 వేలకు ఆ సినిమా టోటల్ తమిళ్ రైట్స్ సొంతం చేసుకున్నారట.
ఆ రోజుల్లోనే ఆమెకు ఆ సినిమాతో కోట్ల రూపాయలు వచ్చాయట. ఆనాడు ఆమెకు ఆ సినిమాతో వచ్చిన లాభాలు ఇప్పుడు అయితే కొన్ని కోట్లలో ఉంటాయని విశ్వనాథ్ చెప్పారు. ఇక శంకరాభరణం సినిమాను ఒకాయన ఏకంగా 96 సార్లు చూశానని చెప్పడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన చెప్పారు.