Moviesదూరం కాబోతున్న నయన్-విగ్నేశ్ జంట..అంతా అనుకున్నట్లే జరిగిందిగా..?

దూరం కాబోతున్న నయన్-విగ్నేశ్ జంట..అంతా అనుకున్నట్లే జరిగిందిగా..?

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార .. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . కాగా అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో జూన్ 9న మూడుముళ్ల బంధంతో ఒకటైన ఈ జంట పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులై జనాలకు షాక్ ఇచ్చారు.

సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన విగ్నేష్-నయన్ ఆ టైంలో సంచలనాన్ని క్రియేట్ చేశారు . ఎట్టకేలకు ఆ ప్రాసెస్ లీగల్ అంటూ మేమేం తప్పు చేయలేదంటూ కరెక్ట్ డాక్యుమెంట్స్ తమిళనాడు గవర్నమెంటుకు అందజేశారు . అప్పటినుంచి సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తున్న నయనతార-విగ్నేశ్.. దూరం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎస్ నయనతార – విగ్నేశ్ శివన్ కొన్నాళ్లపాటు దూరంగా ఉండబోతున్నారట . దానికి మెయిన్ రీజన్ వర్క్ అంటూ తెలుస్తుంది . నయనతార – విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త ఇంట్లో కాపురం పెట్టిన విషయం తెలిసిందే. కాగా నయనతార వర్క్ పరంగా బిజీగా ఉండడంతో విగ్నేశ్ శివన్ నే పిల్లలను చూసుకునే బాధ్యతలను తీసుకున్నారట . నయనతార తన సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి ఫారిన్ కంట్రీస్ కు వెళ్ళనట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు వీళ్లిద్దరు దూరంగా ఉండబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news