సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు. రీజన్ ఏదైనా కానివ్వండి ఇలా చూడ చక్కటి జంటలు విడిపోతుంటే అభిమానులకు బాధ కలిగిస్తుంది . కాకపోతే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియమణి కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు వినిపించాయి.
ఆ కారణంగానే ఆమె ఇలా భర్త కు దూరంగా బ్రతుకుతుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి . ప్రెసెంట్ ఆమె భర్త దుబాయ్ లో.. ఆమె ఇండియాలో ఉంటున్నట్లు ఫ్రెండ్స్ కూడా చెప్పిన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అలాంటి వార్తలకు చెక్ పెట్టేసాడు ప్రియమణి భర్త ముస్తఫా . రీసెంట్గా రవితేజ నేనింతే సినిమా హీరోయిన్ అదితి గౌతమ్ గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది.
ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న అతిథి గౌతమ్ ..పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ప్రియమణి – ముస్తఫా జంట. నిజానికి ప్రియమణి – ముస్తఫా విడిపోయారు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ చాలా రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే ” మేము కలిసే ఉన్నాము” అంటూ చెప్పగానే చెప్పేసాడు ముస్తఫా . దీంతో అఫీషియల్ గా ప్రియమణి బ్రేకప్ న్యూస్ ను కొట్టి పడేసినట్లైంది . ఏది ఏమైనా సరే ఈ జంట త్వరగా గుడ్ న్యూస్ చెప్తే బాగుంటుంది అన్నది అభిమానుల ఫీలింగ్..చూద్దాం ఆ రోజు ఎప్పుడు వస్తుందో..?