సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ చేయకుండా వల్గారిటీ పెంచకుండా.. స్టార్ హీరోయిన్గా మారిన ముద్దుగుమ్మలు చాలా తక్కువ.. వాళ్ళల్లో ఒకరే ఈ అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి . పేరుకు మలయాళ బ్యూటీనే అయిన తెలుగులో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . లాస్ట్ గా నటించిన రెండు సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో ,,సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది అంటూ తెలుస్తుంది. అయితే అలాంటిది ఏమీ లేదు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు దొరికితే చేస్తాను అంటూ సాయి పల్లవి చెప్పుకొస్తుంది .
కాగా ఈ క్రమంలోనే సాయి పల్లవి ..మలయాళీ స్టార్ హీరో కొడుకుతో పెళ్లి చేసుకోబోతుందన్న న్యూస్ వైరల్ అవుతుంది. అయితే సాయి పల్లవికి ఆ స్టార్ హీరో కొడుకు ప్రపోజల్ ఇచ్చిన మాట వాస్తవమే అని ..కానీ సాయి పల్లవి ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు అంటూ క్లారిటీ సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది . మలయాళీ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న లెజెండరీ హీరో కొడుకు సాయి పల్లవి నటనకు ..ఆమె అందానికి ఫిదా అయ్యారట. ఈ క్రమంలోనే సాంప్రదాయ బద్దంగా తన పేరెంట్స్ ను తీసుకొని వెళ్లి మరి సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటానని ..సాయి పల్లవి పేరెంట్స్ ను అప్రోచ్ చేయాలట .
ఈ క్రమంలోనే షాక్ అయిపోయిన సాయి పల్లవి పేరెంట్స్ .. తన పెళ్లి విషయంలో పూర్తి హక్కులు తనకే ఇచ్చామని ..తను ఇష్టపడితే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని ..ఏదైనా సరే సాయి పల్లవి డెసిషన్ పైనే ఆధారపడి ఉంది అని ముఖాన్నే చెప్పేసారట . మలయాళీ స్టార్ హీరో లాంటి పెద్ద స్టార్ హీరో వచ్చి సంబంధం అడిగిన ఏ మాత్రం తగ్గని సాయి పల్లవి పేరెంట్స్ నిర్ణయానికి అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు . ప్రతి తల్లిదండ్రులు సాయి పల్లవి అమ్మ నాన్న లాగే ఆలోచించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు .అయితే సాయి పల్లవి మాత్రం ఈ సంబంధాన్ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. సాయి పల్లవి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ఆమె క్లారిటీ ఇచ్చిందట. చూద్దాం సాయి పల్లవి మనసు నచ్చే మగాడు ఎక్కడున్నాడో..?