టాలీవుడ్ మాస్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ వరుసగా క్రాక్ – వీర సింహారెడ్డి సినిమాలతో రెండు సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు అదిరిపోయే మాస్ యాక్షన్ తో తెరకెక్కాయి. క్రాక్ తో వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజకు తిరుగులేని హిట్ ఇచ్చిన గోపీచంద్… ఏకంగా అఖండ తర్వాత బాలయ్యను డైరెక్ట్ చేసే బంపర్ ఛాన్స్ దక్కించుకున్నాడు. బోయపాటి ఎలివేషన్లు చూసిన బాలయ్య అభిమానులు అసలు మలినేని గోపీచంద్ బాలయ్యను ఎలా ? బ్యాలెన్స్ చేస్తారా అని చాలా సందేహాలు వ్యక్తం చేశా
అయితే ఆ సందేహాలు అన్ని గోపీచంద్ పటాపంచలు చేస్తూ వీరసింహారెడ్డిలో బాలయ్యకు అదిరిపోయే ఎలివేషన్లు ఇచ్చారు. అందుకే వీర సింహారెడ్డి సినిమా యావరేజ్ కంటెంట్తో తెరకెక్కి కూడా అటు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను తట్టుకునే మరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాలయ్య చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా తొలిరోజే వీర సింహారెడ్డి సినిమాకు ఏకంగా రు. 54 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా విజయంతో జోష్ మీద ఉన్న మలినేని గోపీచంద్ తన తాజా ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
హైదరాబాదులోని పెద్దమ్మ తల్లి గుడి సాక్షిగా గోపీచంద్ ప్రేమ కథ మొదలైంది. గోపీచంద్ అప్పటికే డాన్‌శీను సినిమా తీసి హిట్ కొట్టి పాపులర్ అవుతున్నాడు. అప్పుడే వెంకటేష్‌తో బాడీగార్డ్ సినిమా డిస్కర్షన్లు నడుస్తున్నాయి. పెద్దమ్మతల్లి అంటే గోపీకి బాగా ఇష్టం. ఆమెను వీలున్నప్పుడల్లా వెళ్లి దర్శించుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఆ తల్లి దర్శనానికి వెళ్లగా గోపీచంద్ ఓ అమ్మాయిని చూడడం.. తొలి చూపులోనే ఈమె నా భార్య అయితే బాగుంటుంది అనుకోవడం.. ఆ తర్వాత ఆమె ఎవరు ? ఎక్కడ ఉంటోంది ? ఏం చేస్తోంది ? అన్నది తెలుసుకోవడం చకచకా జరిగిపోయాయట.
మనోడికి అప్పటికే రెండు హిట్లు పడడంతో పాటు వెంకటేష్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో చాలా మంది సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేవారట. అలా ఆ అమ్మాయి వెంటపడి ఆమెది ఏలూరు అని తెలుసుకున్నాడట. మొత్తానికి ఆ అమ్మాయిని కూడా ఒప్పించేశాడు. ప్రస్తుతం వెస్ట్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఎల్‌వీఆర్ ( వీరసింహారెడ్డికి కూడా ఆయనే వెస్ట్ డిస్ట్రిబ్యూటర్) ద్వారా ఆమె ఫ్యామిలీ వివరాలు కనుక్కుని ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌ను అడిగించాడట.
అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం సినిమా వాడికి పిల్లను ఇవ్వం అని చెప్పేశారట. సినిమా వాళ్లకు చాలా చెడు అలవాట్లు ఉంటాయన్న ఆలోచనతో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారట. చివరకు గోపీ గురించి వాళ్లు కూడా రకరకాల కోణాల్లో ఎంక్వైరీ చేశాక అప్పుడు పెళ్లికి ఒప్పుకున్నారట. అలా గోపీచంద్ ప్రేమ పెళ్లిగా మారింది.