వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. శ్రీదేవితో పాటు శ్రీదేవి అమ్మ రాజేశ్వరి దేవి ఇద్దరు కూడా వేరువేరు సినిమాల్లో ఓకే హీరో పక్కన నటించారు. అసలు శ్రీదేవి తల్లికి కూడా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉందన్న విషయమే చాలా మందికి తెలియదు. శ్రీదేవి సినీ వారసత్వం నుంచే వచ్చారన్నది ఎవ్వరూ ఊహించలేరు. శ్రీదేవి పూర్వీకులది చిత్తూరు జిల్లా. వీరంతా చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడులోని శివకాశి వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే శ్రీదేవి జన్మించింది.
శ్రీదేవి తెలుగుతో పాటు తమిళంలో ఒక ఊపు ఊపేసి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. శ్రీదేవి కెరీర్ ప్రారంభంలో బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించింది. అలాగే మరో సినిమాలో సూపర్ స్టార్ కృష్ణకు కూతురుగా నటించింది. అలాంటి శ్రీదేవి అదే కృష్ణ, ఎన్టీఆర్ కు జోడిగా హీరోయిన్‌గా నటిస్తుందని ఎవరు ఊహించలేదు. అయితే శ్రీదేవి నేరుగా సినిమాల్లోకి వచ్చిందని చాలామంది అనుకుంటారు.
శ్రీదేవి తల్లి రాజేశ్వరి దేవి కూడా సినిమాల్లో నటించారు. ప్రఖ్యాత దర్శకుడు కొల్లి ప్రత్యాగాత్మ మొదటి సినిమా భార్యాభర్తలులో రాజేశ్వరి నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ సినిమాలో నాగేశ్వరరావు హీరోగా చేశారు. హీరోయిన్ తో పాటు ఉండే మిత్రబృందంలో రాజేశ్వరి ఉంటుంది. అలాగే సినిమాలో జోరుగా హుషారుగా అనే పాటలో ఏఎన్ఆర్ తో కూడా ఆమె కనిపిస్తుంది.
ఆ తర్వాత అదే ఏఎన్నార్‌కు జోడీగా ఆమె కుమార్తె శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించారు. అంటే అటు తల్లితోనూ, ఇటు కూతురుతోనూ స్క్రీన్ పంచుకున్న హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. మరో ట్విస్ట్ ఏంటంటే రాజేశ్వరి కుమార్తె శ్రీదేవి ఏఎన్నార్‌తో పాటు ఆయన కొడుకు నాగార్జునకు కూడా జోడీగా నటించారు. ఇది మరో రికార్డ్ అని చెప్పాలి.