తెలుగు సినీ చరిత్రలో ఒక కలికితురాయి. తెలుగు వారి మనసుల్లో వెండి వెన్నెలలు పూయించిన అజరామర దృశ్య కావ్యం పదహారేళ్ల వయసు. ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్(అప్పటికికాదు) శ్రీదేవి.. చంద్రమోహన్, మోహన్‌బాబు(ఈ సినిమా నుంచే ప్రత్యేక డైమన్షన్ చూపించారు.(ఎలా కొట్టాను దెబ్బ! అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది)) నట విశ్వరూపానికి ఈ సినిమా.. అద్దం పట్టింది. నిజానికి వీరి నటనకు వెండి తెర సరిపోదనే కితాబు రావడం అంటే.. మాటలా..!
ఈ క్రెడిట్ అంతా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడితే. అయితే.. కథ మాత్రం తమిళనాడుకు చెందిన భారతీరాజాది! ఇక, రాఘవేంద్ర రావుకు ఓ సందర్భంలో తమిళనాడు దర్శకుడు ఒకాయన.. ఈ సినిమాను (అప్పటికే తమిళంలో వచ్చేసింది) చూపించారు. కథ నచ్చింది. వెంటనే భారతీరాజా కూడా కథను ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. హీరోయిన్.. శ్రీదేవి. డౌటే లేదు. మరి హీరో.. ఎవరు? అంటే.. ఠక్కున రాఘవేంద్రుడి మదిలో మెరిసిన పేరు శోభన్ బాబు. నేను చెబుతున్నా.. బాబును బుక్ చేయండి
అన్నారు రాఘవేంద్రరావు.
అంటే వారి మధ్య అంత సాన్నిహిత్యం ఉండేది. అయితే.. దీనికి శోభన్ బాబు ఒప్పుకోలేదు. కథ బాగుంది. కానీ, ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. పైగా కుంటుతూ నటించాలా ? నో..నో!!
అని తిరస్కరించారు. అలాగని రాఘవేంద్రరావుకు ఆయన ఫోన్ చేయలేదు.. చెప్పలేదు. కానీ, అడ్వాన్స్ మాత్రం తిరస్కరించేశారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న రాఘవేంద్రరావు.. చూడు ఈ హీరోను ఎలా.. చూపిస్తానో.. అని పంతం పట్టారు.
ఆ పంతం మేరకే ఏమాత్రం స్టార్ హీరో గా కనిపించని చంద్రమోహన్‌ను దీనిలో హీరోను చేశారు. అంతేకాదు.. కథ మొత్తం శ్రీదేవి చుట్టూ తిరిగినా.. చివరకు.. సింపతీ సహా.. స్టార్ డమ్ అంతా కూడా.. చంద్రమోహన్‌కు దక్కుతుంది..! సో.. ఇలా శోభన్‌బాబు నటించాల్సిన సినిమాలో చంద్రమోహన్ నటించారు. అనంతరం.. చంద్రమోహన్‌కు అవకాశాలు కుప్పలు కుప్పలుగా రావడం గమనార్హం.