సినిమాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోలు, హీరోయిన్ల మధ్య కొన్ని సీన్లు బాగా పండాలంటే వారు నటించడం కంటే జీవించేయాలి. అలా జీవించినప్పుడే ఆ సీన్ పండుతుంది.. చూసే ప్రేక్షకులకు మంచి ఫీల్ కలుగుతుంది. ఉదాహరణకు ఇప్పట్లో లిప్ లాక్ సీన్లలో హీరో, హీరోయిన్లు నిజంగానే జీవించేస్తున్నారు.
ఇక అప్పట్లో లిప్ లాక్ సీన్లు తక్కువగా ఉండేవి. హీరో, హీరోయిన్లు గట్టిగా ఆలింగనం చేసుకునే సీన్లు ఎక్కువగా పెట్టేవారు దర్శకులు.
అలాగే కొన్ని సినిమాలలో హీరోయిన్లను.. హీరోలు ఎత్తుకొని తమ ప్రేమమాను వ్యక్తం చేయడం లేదా సాంగ్స్‌లో హీరోయిన్లను ఎత్తుకోవటం ఎక్కువగా ఉండేవి. ఇక అగ్ర నిర్మాత రామానాయుడు తన బ్యానర్లో శోభన్ బాబు – శ్రీదేవి – జయప్రద జంటగా దేవత సినిమా నిర్మించారు. 1982లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సత్యానంద్ ఈ సినిమాకు కథ అందించగా… సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రాఘవేంద్రరావు తెరకెక్కించిన తొలి సినిమాగా దేవత నిలిచింది.
ఈ సినిమాలో అన్ని పాటలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి, వెల్లు వచ్చి గోదారమ్మ పాటను తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి తీరంలో చిత్రీకరించారు. కింద అంతా బుదరగా ఉండడంతో శ్రీదేవిని నడవకుండా ఎత్తుకొని గోదావరిలో బోటులోకి తీసుకువెళ్లాల్సి వచ్చేదట. అయితే శోభన్ బాబు.. శ్రీదేవిని ఎత్తుకునేందుకు ఇబ్బంది పడేవారట. రామానాయుడు శ్రీదేవిని స్వయంగా ఎత్తుకొని ఆ బురదలో నడుచుకుంటూ బోటులోకి తీసుకు వెళ్లేవారట.
ఆ సాంగ్ మొత్తం మూడు రోజులపాటు షూట్ చేశారు. మూడు రోజులు శ్రీదేవిని రామానాయుడు ఎత్తుకొని బోటు వద్దకు తీసుకు వెళ్ళవారట. విచిత్రం ఏంటంటే శ్రీదేవిని శోభన్ బాబు ఎత్తుకునేందుకు ఇష్టపడేవారు కాదని.. అదే తాను ఎత్తుకుంటే ఫీలయ్యే వారిని రామానాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.