సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య – సమంత జంటకు ఎంత పాపులారిటీ ఉందో ..అదే విధంగా బుల్లితెరపై రష్మి – సుధీర్ కు అంతే పాపులారిటీ ఉంది . ఇంకా పక్కాగా చెప్పాలంటే వాళ్ళిద్దరి కన్నా ఈ జంటకు కూసింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది . రష్మి – సుధీర్ ఒకే తెరపై కనిపిస్తే చాలు అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు . వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు.
కానీ అభిమానుల మనసుల్లో మాత్రం వీరిద్దరు భార్య భర్తలు గానే స్థిరపడిపోయారు . ఇప్పటికీ రష్మీ పక్కన సుధీర్ పేరు లేకపోయినా ..సుధీరష్మీ ర్ పక్కన పేర్లు లేకపోయినా జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటారు. కాగా జబర్దస్త్ ద్వారా ఇంత పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ .. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇతగాడు వస్స్తాడు ..రీ ఎంట్రీ ఇస్తాడు అంటూ వార్తలు వినిపించినా ఎప్పుడు ఇస్తాడొ ఎవరికీ అర్థం కావడం లేదు.
రష్మీ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ తెలుస్తుంది . దానికి కారణం టాలీవుడ్ బుల్లి తెర హాట్ యాంకరమ్మ అని అంటున్నారు జనాలు. అప్పుడప్పుడే రష్మీ – సుధీర్ పేరు పాపులారిటీ సంపాదించుకున్న తరుణంలో ఈ యాంకర్ తో సుధీర్ రొమాన్స్ చేసి మరో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాడు. అంతేకాదు ఇప్పటికీ సుధీర్ తో రాసుకుని పూసుకుని తిరుగుతున్న ఈ యాంకర్ కి రష్మీ అంటే అస్సలు పడదు .
ఒకే ఈవెంట్లో ఇద్దరి ఇద్దరు పక్కపక్కనే ఉన్న మాట్లాడుకోరు . అంతేనా సుధీర్ ని జబర్దస్త్ నుండి బయటకు రావడానికి ఈ యాంకర్ ఎన్నో ప్రయత్నాలు చేసిందని అవి ఫలించకపోయినా సరే ఎట్టకేలకు ఆమె అనుకున్నది జరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైన మళ్లీ తెర పై సుధీర్-రష్మి యాంకరింగ్ చేయాలని.. లైఫ్ లో కూడా వీళ్ళిద్దరూ కలిసి బ్రతకాలని కోరుకుంటున్నారు జనాలు..చూద్దాం ఏం జరుగుతుందో..?