MoviesSarwanand శర్వానంద్ ది లవ్ ఫెయిల్యూరా..? అంత దారుణంగా మోసపోయాడా..? పెళ్లి...

Sarwanand శర్వానంద్ ది లవ్ ఫెయిల్యూరా..? అంత దారుణంగా మోసపోయాడా..? పెళ్లి తరువాత బయట పడ్డ నిజం..!?

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. సినిమా ఇండస్ట్రీలో చాలా కూల్ గా క్లాస్ గా తనపని తాను చేసుకుంటూ కాంట్రవర్షియల్ కంటెంట్ క్రియేట్ చేయకుండా వెళ్ళిపోయే హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు . తన మైండ్ సెట్ కి కి తగ్గ సాఫ్ట్ పాత్రలను చూస్ చేసుకుంటూ శర్వానంద్ ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు . అఫ్ కోర్స్ శర్వా చేసిన సినిమాలు ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాప్ అవుతూనే వచ్చాయి . నిజానికి ఆయన ఈ మధ్య కాలంలో హిట్ అందుకున్న సినిమా లేనే లేవు .

కానీ శర్వానంద్ మార్కెట్ మాత్రం ఇండస్ట్రీలో బాగానే ఉంది . దానికి కారణం శర్వానంద్ మంచితనం.. ఏ సినిమా చేసిన అందులో నటనను మెయిన్ గా చేసుకునే శర్వానంద్ .. అంటే జనాలకు విపరీతమైన క్రేజ్ . రీసెంట్ గానే రక్షిత రెడ్డి ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన శర్వానంద్.. జనవరి 26న గ్రాండ్గా తన నిశ్చితార్థం చేసుకున్నాడు . దీనికి సంబంధించిన పిక్స్ , వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అయితే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ..గతంలో స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడు అంటూ వార్తలు వినిపించాయి.

అంతేకాదు ఆమె కూడా శర్వా ను ఇష్టపడిందట . కానీ శర్వానంద్ కెరియర్ చెప్పుకోతగ్గ రీతిలో లేదని.. ఫ్యూచర్లో కూడా శర్వానంద్ హీరోగా కెరియర్ ని సెటిల్ చేసుకునే దాఖలాలు కనిపించడం లేదని .. ఆ కారణంగానే హీరోయిన్ పేరెంట్స్ శర్వానంద్ ను లైట్ తీసుకున్నారట . ఇదే విషయం తెలుసుకున్న శర్వ చాలా హర్ట్ అయిపోయారట . అమ్మడు కూడా దూరం పెడుతూ ఉండడంతో శర్వానంద్ ఈ ప్రేమ దోమ వద్దు అంటూ లవ్ కి దూరంగా ఉన్నాడట. సైలెంట్ గా తన పని తాను చేసుకున్న శర్వానంద్ లైఫ్ లో రక్షిత రెడ్డి ఎంటర్ అయింది . కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. తన వ్యక్తిత్వం మంచి మనసు అర్థం చేసుకున్న శర్వానంద్ ఆమెతో ఇట్టే ప్రేమలో పడిపోయారు . ఇదే విషయాని ఇంట్లో పెద్దలకు చెప్పించి ఒప్పించి ఫైనల్ గా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు . ఏది ఏమైనా సరే శర్వానంద్ పెళ్లి చేసుకునే టైంలో ఇలా గతంలో లవ్ స్టోరీని మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఆయన ఫాన్స్ కు నచ్చడం లేదు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news