MoviesTL రివ్యూ: మైఖేల్‌.. ఆ మూడు సినిమాలు కాపీ కొట్టేశారు..!

TL రివ్యూ: మైఖేల్‌.. ఆ మూడు సినిమాలు కాపీ కొట్టేశారు..!

టైటిల్‌: మైఖేల్‌
నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, గౌతం మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసూయ, వరలక్ష్మి శరత్‌కుమార్
ఎడిటింగ్‌: ఆర్.సత్యనారాయణన్
మ్యూజిక్‌: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్
నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
దర్శక‌త్వం : రంజిత్ జయకోడి
రిలీజ్ డేట్‌: 02, ఫిబ్ర‌వ‌రి, 2023

గ‌త కొంత కాలంగా త‌న‌దైన రేంజ్ హిట్ కోసం తిప్ప‌లు ప‌డుతోన్న యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా న‌టించిన సినిమా మైఖేల్‌. ట్రైల‌ర్‌తో ఆస‌క్తి రేపిన ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ? ఉందో స‌మీక్షలో చూద్దాం.

క‌థ‌:
మైఖేల్ (సందీప్ కిషన్) చిన్నప్పటి నుంచే త‌న తండ్రి గురునాథ్ ( గౌతంమీన‌న్‌)ను చంపాల‌న్న కోరిక‌తో ఓ గ్యాంగ్‌స్ట‌ర్ ద‌గ్గ‌ర చేర‌తాడు. ఈ క్ర‌మంలోనే గురునాథ్‌కు బాగా ద‌గ్గ‌ర‌వుతాడు. త‌న‌పై మ‌ర్డ‌ర్ ఎటంప్ట్ చేసిన వారిని చంపాల‌ని గురునాథ్ మైఖేల్‌కు చెప్తాడు. అప్పుడు జ‌రిగిన ప‌రిణామాల్లోనే మైఖేల్ తీరా (దివ్యాంశ కౌశిక్) కి దగ్గర అయ్యి ఆమె ప్రేమ‌లో ప‌డి గురునాథ్‌ను సైడ్ చేస్తాడు. ఆ స‌మ‌యంలోనే గురునాథ్ త‌న‌యుడు అమ‌ర్‌నాథ్ ( వ‌రుణ్ సందేశ్‌) గురించి కూడా మైఖేల్‌కు ఓ నిజం తెలుస్తుంది.
అప్ప‌టి నుంచి మైఖేల్‌కు, గురునాథ్‌కు మ‌ధ్య గ్యాప్ పెరుగుతుంది. అస‌లు మైఖేల్ ఏం చేశాడు ? అత‌డి తండ్రి ఎవ‌రు ? మైఖేల్ హెల్ప్ చేసిన విజ‌య్ సేతుప‌తి పాత్ర ఏంట‌న్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
త‌న త‌ల్లికి జ‌రిగిన అన్యాయానికి ప‌గ తీర్చుకునే పాత్ర‌ను బాగా ఎలివేట్ చేశాడు ద‌ర్శ‌కుడు. మైఖేల్ గ్యాంగ్స్ట‌ర్‌గా ఎద‌గ‌డం.. అత‌డి పాత్ర‌ను ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ చేయ‌డం బాగున్నాయి. అతడిలోని ఆవేశం, ధైర్యం, అన్యాయం జ‌రిగితే ఎదురు తిర‌గ‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను ఆ పాత్ర‌లో సందీప్ కిష‌న్ బాగా ప‌లికించాడు. ఇక హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ త‌న న‌ట‌న‌తో పాటు అందంతోనూ ఆక‌ట్టుకుంది. ఇక వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా త‌న పాత్ర‌లో బాగా ఒదిగిపోయింది.

అన‌సూయ‌కు మంచి పాత్ర దొర‌క‌గా, విజ‌య్ సేతుప‌తి పాత్ర సినిమాకు హైలెట్‌. మిగిలిన వారిలో గౌత‌మ్‌మీన‌న్‌, వ‌రుణ్ సందేశ్‌, అయ్య‌ప్ప శ‌ర్మ పెర్పామెన్స్‌లు కూడా అదిరిపోయాయి. క‌థ నేప‌థ్యానికి అనుగుణంగా సినిమాను రెట్రో స్టైల్లో తెర‌కెక్కించిన తీరు బాగుంది. ఈ సినిమాలో త‌న ప్రేమ‌తో పాటు త‌ల్లి సెంటిమెంట్ మిక్స్ చేయ‌డం బాగున్నా.. దానిని సంఘ‌ర్ష‌ణాత్మ‌కంగా తెర‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు ఫెయిల్ అయ్యాడు.

ఓ వ్య‌క్తిని చంపేందుకు మైఖేల్ ఢిల్లీకి వెళ్ల‌డం, అక్క‌డ తీర ప్రేమ‌లో ప‌డ‌డం.. బోరింగ్‌. వారి ప్రేమ‌లో ఏ మాత్రం ఫీల్ ఉండ‌దు. వ‌ర‌ల‌క్ష్మి, విజ‌య్ సేతుప‌తి వ‌చ్చాకే కాస్త ఆస‌క్తి క‌లుగుతుంది. చివ‌రి 15 నిమిషాలు బుల్లెట్ల మోత మోగిపోయింది. క‌థ‌లో లోతు ఉన్నా సీన్స్ క‌న్‌ప్యూజ్‌గా స్లోగా సాగాయి. అస‌లు సినిమా పంజా, మున్నా, కేజీఎఫ్ సినిమాల్లోని సీన్ల‌ను కాపీ కొట్టి తీసిన‌ట్టుగా ఉంది. సెకండాఫ్‌లో చాలా సీన్లు ఏ మాత్రం ఆక‌ట్టుకోవు.

సినిమాలో ఇంట్ర‌స్టింగ్ ప్లేను కూడా బిల్డ్ చేయ‌లేదు. గ‌తంలో వ‌చ్చిన ప‌లు యాక్ష‌న్ సీన్ల తాలూకూ యాక్టివిటీస్‌ను ఈ సినిమాలో నింపేయ‌డం సినిమాకు పెద్ద మైన‌స్ అయ్యింది. చాలా చోట్ల లాజిక్ కూడా లేదు. క్లైమాక్స్ కూడా అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఉంది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్ గా సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. సామ్ సిఎస్ సంగీతం స్థాయికి మించే ఉంది. సినిమాటోగ్ర‌ఫీ మాత్రం సినిమాకే హైలెట్. చాలా సీన్ల‌ను కెమేరా ప‌నిత‌న‌మే హైలెట్ చేసింది. నిర్మాత‌లు భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. అయితే దర్శకుడు రంజిత్ జయకోడి రచయితగా దర్శకుడిగా మాత్రం ఆక‌ట్టుకోలేదు. మితిమీరిన హింస‌, పాత సినిమాల తాలూకూ సీన్లతో సినిమా చుట్టేయ‌డం మ‌రీ ఘోరం.

ఫైన‌ల్‌గా…
యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ మైఖేల్ మూవీలో మెయిన్ పాయింట్‌కు తోడుగా సినిమాలో కీల‌క స‌న్నివేశాలు బాగున్నాయి. అయితే స్క్రీన్ ప్లేలో ఇంట్ర‌స్ట్ మిస్ అవ్వ‌డం, ట్రీట్‌మెంట్ బోరింగ్‌, మెయిన్ క్యారెక్ట‌రైజేష‌న్స్ వీక్‌గా ఉండ‌డం, పాత సినిమాల సీన్ల‌ను అనుక‌రించ‌డం బాగా మైన‌స్‌. ఓవ‌రాల్‌గా యాక్ష‌న్ ఎలిమెంట్స్ న‌చ్చే ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే మైఖేల్ క‌నెక్ట్ అవుతుంది.

ఫైన‌ల్ పంచ్‌: పాత సినిమాల సీన్ల మిక్సీతో తీసిన రొటీన్ రివేంజ్ డ్రామా ఈ మైఖేల్‌

మైఖేల్ TL రేటింగ్‌: 2.5 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news