MoviesSiya Gautham రవితేజ హీరోయిన్ పెళ్ళి చేసుకున్న ఈ అబ్బాయి అంత...

Siya Gautham రవితేజ హీరోయిన్ పెళ్ళి చేసుకున్న ఈ అబ్బాయి అంత రిచ్చా..మంచి సౌండ్ మొగుడినే పట్టిందిగా..!!

ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు .. స్టార్ హీరోయిన్స్ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బడా బ్యూటీస్ అందరూ వరుసగా బ్యాక్ టు బ్యాక్ పెళ్లిళ్లు చేసుకోవడం ఫ్యాన్స్ కి బాధ కలిగించే విషయమే . అయితే లైఫ్ లో సెటిల్ అయిపోయినందుకు ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేనింతే సినిమాలో రవితేజకు జోడిగా నటించినా .. అదితి గౌతమ్ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది . నేనింతే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మా..చాలా సైలెంట్ హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకుంది.

ఈ సినిమాను తెరకెక్కించింది పూరి జగన్నాథ్ . మనకు తెలిసిందే పూరి జగన్నాథ్ ముంబై బ్యూటీలని ఎక్కువగా తన సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. కాగా మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న అతిథి గౌతం ..ఆ తర్వాత ఎందుకో తెలుగులో అవకాశాలు అందుకోలేకపోయింది .. వచ్చిన అరా కొరా కూడా అమ్మడుకు మంచి పేరు తీసుకురాలేకపోయాయి . ఈ క్రమంలోనే అదితి గౌతమ్ బాలీవుడ్ లోనూ తన లక్ ని పరీక్షించుకుంది . అయితే అక్కడ కూడా అమ్మడు అంతంత మాత్రమే నెట్టుకొస్తూ ఉండడంతో ..జనాలు అమ్మడు పేరుని మర్చిపోయారు.

కాగా ఇదే క్రమంలో అమ్మడు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది . ఎవరికి చెప్పకుండా ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా.. తన పెళ్లి ఫోటోను అఫీషియల్ గా పోస్ట్ చేస్తూ కన్ఫామ్ చేసింది . ఫిబ్రవరి 6వ తేదీన అందాల ముద్దుగుమ్మ – నిఖిల్ పాల్కావాలా అనే ముంబైకి సంబంధించిన బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది . వీళ్ళ పెళ్లి ముంబైలో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది .

అందుతున్న సమాచారం ప్రకారం నిఖిల్ పాల్కావాలా కు ముంబైలో పెద్ద పెద్ద బిజినెస్ లు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కోట్ల ఆస్తికి వన్ అండ్ ఓన్లీ సన్ .. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైనా అదితి గౌతమ్ – నిఖిల్ పాల్కావాలా.. గత కొంతకాలంగా ప్రేమించుకుని ..పెద్దలను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు . ఏది ఏమైనా సరే అధితి గౌతమ్ మంచి సౌండ్ పార్టీ నే పట్టింది అంటూ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news