ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలని – అబ్బాయిలని ఈక్వల్ గా చూస్తున్నామంటూ సమానవాట కల్పిస్తున్నామంటూ గోల్డెన్ డైలాగ్స్ చెప్పినా వన్స్ ఇంటికి వెళ్ళాక ఆడదాన్ని అబ్బాయిలు ఎలా ట్రీట్ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా జనరల్‌గా అందరిలో కామన్ గా జరిగేదే. అయితే కేవలం ఇళ్లలోనే కాదు .. స్టార్స్ అని చెప్పుకుంటున్న సినిమా ఇండస్ట్రీలోనూ అలానే ఉంటుంది పరిస్థితి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ .. ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది .
కాగా ఇలాంటి క్రమంలోనే ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రకుల్ ఎవరో స్టార్ హీరోతో కమిట్ అయిందని .. ఆ కారణంగానే బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని.. మరికొందరు బాయ్ ఫ్రెండ్ కి బై బై చెప్పేసింది అని.. మరికొందరు డ్రగ్స్ తీసుకుంటుందని ..ఇలా నోటికి వచ్చినట్లు ..చేతికొచ్చినట్లు రాసేస్తున్నారు . ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ వాటన్నిటిని కొట్టి పడేసింది. అలాంటి ఫేక్ న్యూస్ పట్టించుకునే అంత టైం నాకు లేదు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చేసింది.
కాగా ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అనుకుంటున్నా అమ్మాయిలకు సజీషన్ ఇచ్చింది. ” డబ్బు కోసమైతే ఇండస్ట్రీలోకి రానే రావద్దు. కష్టపడే తత్వం ఉండాలి.. అందంగా కనిపించాలి.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. ఎలాంటి రోల్స్నైనా చేయగలగాలి.. మరి ముఖ్యంగా పురుషాధిత్యాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఉండాలి .. సమాజం ఎంత మారుతున్న ఎదుగుతున్న పురుష ఆధిపత్యానికి మాత్రం చెక్ పడటం లేదు.. ఎక్కడికి వెళ్ళినా పురుషులదే పై చేయి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.. నా ఇంట్లో నన్ను అలా పెంచలేదు ..ఆడ మగ సమానం అంటూ పెంచారు ..ఇప్పటికే కాదు ఎప్పటికి నేను అదే చెప్తాను.. స్టార్ సెలబ్రెటీస్ స్టేటస్ కావాలనుకుంటే కొన్ని తిప్పలు తప్పవు ” అంటూ బోల్డ్ గా స్పందించింది రకుల్..!!