కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. 20 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా హిస్టరీలో రజనీ ఛరిష్మా, క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు వయస్సు మీద పడి ముసలోడు అయినా కూడా రజనీ ఇమేజ్, క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదర్లేదు. రజనీకాంత్ రీసెంట్‌గా 2.0, పేట, దర్బార్, పెద్దన్న లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు.
రీసెంట్‌గా రజనీ తన సినిమాల్లో కథలపై దృష్టి పెట్టడం లేదు కాని… సరైన కథ పడితే రజనీ సినిమాలు పాన్ ఇండియా రికార్డులకు పాతరేయడం ఖాయం. రజనీ త్వరలోనే జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. మిల్కీబ్కూటీ తమన్నా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.
జైలర్ సినిమా కోసం రజనీకి అక్షరాలా రు. 140 కోట్ల రెమ్యునరేషన్ ముడుతోందట. రజనీ జైలర్ సినిమాతో పాటు లాల్ సలామ్ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలు. లైకా ప్రొడక్షన్స్ వాళ్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇందుకు గాను 7 రోజుల కాల్షీట్లు కూడా ఇచ్చేశాడట.
ఈ 7 రోజుల కాల్షీట్లకు గాను రజనీకి లైకా వాళ్లు రు. 25 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. త్వరలోనే లాల్ సలామ్ సెట్లోకి రజనీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వారానికి రు. 25 కోట్ల రెమ్యునరేషన్ అంటే… రోజుకు రు 3.5 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇస్సతున్నారన్న మాట. బహుశా సౌత్ ఇండియాలోనే ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకునే హీరో రజనీ మాత్రమే అని చెప్పాలి. ఈ వయస్సులోనూ రజనీ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదు అనేందుకు ఇదే నిదర్శనం.