యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ముందుగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఇతిహాస గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కృతీససన్… ప్రభాస్‌కు జోడిగా సీతగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ రెండు పార్టులుగా వస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ మూడు సినిమాల కంటే కూడా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె.
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రు. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక మహానటి తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. నాగ్ అశ్విన్ టేకింగ్‌పై ప్రతి ఒక్కరికి ఎంతో నమ్మకం ఉంది. నాగ్ అశ్విన్ తప్పకుండా మ్యాజిక్ చేస్తాడని అందరూ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా కథ టైమ్ మిషన్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే లీకులు వచ్చాయి. 2050 కాలంలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ? చూపించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
సినిమాలో ప్రతీదీ చాలా గ్రాండియర్ గా కనిపించబోతుందని కూడా తెలుస్తోంది. నాగ్ అశ్విన్ సినిమా చూస్తున్నంత సేపు మనలను మరో ప్రపంచంలోకి తీసుకు వెళ్ళబోతున్నాడు అంటూ కూడా సినిమా యూనిట్ నుంచి మ్యాటర్ బయటకు వచ్చేసింది. ప్రభాస్‌కి జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కన్నా ముందు ఆదిపురుష్, సలార్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే రెండో పార్ట్ కంటే కూడా ముందే ప్రాజెక్ట్ కే రిలీజ్ అవుతుందా ? లేదా అన్నది క్లారిటీ లేదు.
ఏదేమైనా ఈ సమ్మర్ నుంచి వచ్చే సమ్మర్లోగా ప్రభాస్ నుంచి మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. పైగా అన్ని భారీ పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఎలాంటి బజ్ ఉంటుంది అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక ప్రాజెక్టు కే విషయానికి వస్తే ఈ సినిమా మార్కెటింగ్ ఇప్పటికే చాలా వరకు సైలెంట్గా పూర్తి చేశారు. నైజాంలోనే ఈ సినిమాను రు. 80 కోట్ల రేషియోలో అమ్మినట్టు తెలుస్తోంది.
అయితే ఆ విషయాలేవీ బయటకు రానివ్వడం లేదు. త్వరలో ప్రాజెక్టు కే రిలీజ్ డేట్‌తో పాటు రెండు భాగాలుగా వస్తుందా ? ఒక భాగమా అన్నదానిపై నిర్మాత అశ్వనీదత్ వచ్చచే నెలలో ఒక అప్డేట్ వదులుతున్నారట. అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ ప్రాజెక్ట్ కే గురించి ఒక్కో మ్యాటర్ లీక్ అవుతుంటే ఫీజులు ఎగిరిపోయేలా ఉంది.