Movies"మా ఇంటి కోడలు కావాలంటే ఆ పని చేయాల్సిందే".. ప్రభాస్ అమ్మ...

“మా ఇంటి కోడలు కావాలంటే ఆ పని చేయాల్సిందే”.. ప్రభాస్ అమ్మ పెట్టిన కండీషన్ కి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో బాలీవుడ్ లో బోలెడు మంది హీరోలు ఉన్నా సరే ప్రభాస్ పేరు చెప్తే వచ్చే క్రేజ్ రెస్పాన్స్ మరి ఏ హీరో పేరు చెప్పినా రాదు అనడంలో సందేహం లేదు . నెంబర్ వన్ స్థాయిలో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి అంటే మాత్రం భయపడిపోతున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు .

కాగా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రభాస్ ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ప్రభాస్ అమ్మగారు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ కి పెళ్లి సంబంధం తీసుకొచ్చే వాళ్ళ రిలేటివ్స్ కి ప్రభాస్ అమ్మగారు క్రేజీ కండిషన్స్ పెట్టారట . మా ఇంటికి కోడలైన తర్వాత ఎవరైనా సరే పద్ధతిగా ఉండాలి.. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని సినిమాలు మానేసి ..ప్రభాస్ భార్య్గా ..రాజు ఉప్పలపాటి ఇంటికి కోడలుగా ఉండాలి అంటూ కండీషన్ పెట్టిందట.

ఈ క్రమంలోనే అనుష్క శెట్టితో ప్రభాస్ పెళ్లి జరుగుతుందా లేదా అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు . అంతేకాదు అనుష్క – ప్రభాస్ అడిగితే ఆమె సినిమాలు ఆపేయడానికి కూడా సిద్ధం అంటూ రెబల్ ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్క ఫ్రెండ్షిప్ కోసం సినిమాలైనా ఆపేసుకుంటాను అని చెప్పుకొచ్చింది . ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ అమ్మగారు పెట్టిన క్రేజీ కండిషన్స్ కి అనుష్క పరోక్షకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంటున్నారు రెబల్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news