బాహుబలి సీరిస్ సినిమాలతో యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అసలు ఆ సినిమా ప్రభాస్‌ను నేషనల్ స్టార్‌ను మాత్రమే కాదు.. ఏకంగా ఇంటర్నేషనల్ రేంజ్‌కు తీసుకుపోయింది. అలా వచ్చిన క్రేజ్‌ను ప్రభాస్ సరిగా యూజ్ చేసుకుని.. తర్వాత కూడా హిట్లు పడి ఉంటే అసలు ఈ రోజు బాలీవుడ్ స్టార్ హీరోలనే తలదన్నేసేంత ఎత్తులో ఉండేవాడు.
2017లో బాహుబలి – ది కంక్లూజన్ తర్వాత 2019లో సాహో వచ్చింది. నిజానికి ఆ సినిమాకు కూడా బాహుబలి సీరిస్ దెబ్బతో నేషనల్ హైప్ వచ్చేసింది. అదృష్టవశాత్తు ప్రభాస్ క్రేజ్ వర్కవుట్ అవ్వడంతో పాటు నార్త్ జనాలకు సాహో ఎక్కేయడంతో గట్టెక్కేశారు. ఆ తర్వాత రాధేశ్యామ్ 20222లో వచ్చింది. పెద్ద డిజాస్టర్. పదేళ్లలో ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు నాలుగైదు మాత్రమే.
ఆ వస్తోన్న సినిమాలు కూడా సక్సెస్ కావడం లేదు. ఫ్యూచర్ ప్లానింగ్ కూడా కరెక్టుగా ఉన్నట్టు లేదు. ఓ వైపు సలార్ రెండు భాగాలు అంటున్నారు. ఇవి ఈ యేడాది వచ్చేలా లేవు. ప్రాజెక్ట్ కే కూడా 2024 అంటున్నా సలార్ లేట్ అయితే అది కూడా లేట్ అయిపోవచ్చు. ఇక ఆదిపురుష్ అతీగతీ లేకుండా పోయింది. అసలు ఆ సినిమా మీద బజ్ కూడా లేదు.
మారుతి ప్రాజెక్ట్… దానికి జస్ట్ రెండు నెలల టైం చాలని అంటున్నారు. ఇక పీపుల్స్ మీడియా సినిమా ఉంది. ఇక సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సినిమా. ఇలా ఒక్కో సినిమా ఒప్పుకుంటూ పోతూ… ఏదీ కంప్లీట్ చేయట్లేదు. పైగా ప్రతి సినిమా సగం సగం షూటింగ్‌లు అయ్యి మధ్యలో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే ఏదీ ఫైనల్ కాదు.. ఏదీ రిలీజ్ కాదన్నట్టుగా ఉంది.
ఇంతలోనే ప్రాజెక్ట్ కే కూడా రెండు భాగాలుగా వస్తోందని మరో గ్యాసిప్ బయటకు వచ్చింది.. రాజమౌళి బిల్టప్ చేసిన ఈ భయంకరమైన ఇమేజ్‌ను ప్రభాస్ సరిగ్గా హ్యాండిల్ చేసుకోవట్లేదు. ప్రభాస్ ఇలా అడ్డదిడ్డమైన ప్లానింగ్‌తో వెళితే కెరీర్ తిరోగమనంలో వెళుతుందనడంలో సందేహం లేదు.