టాలీవుడ్ లో హీరోయిన్లు.. దర్శకుల మధ్య బంధాలు, అనుబంధాలు తెరవెనక తతంగాలు మామూలుగా ఉండవు. ఒక దర్శకుడు.. ఒక హీరోయిన్ పై మోజు పడితే ఆమెకు తన సినిమాల్లో వరుస పెట్టి ఛాన్సులు ఇస్తూ ఉంటాడు. లేదా ఒక దర్శకుడు.. ఒక హీరోయిన్ ను తన సినిమాల్లో పదే పదే రిపీట్ చేస్తూ ఉంటుంటే వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందన్న ప్రచారం కూడా గట్టిగానే నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒక హీరోయిన్ను తమ సినిమాల్లో పదేపదే రిపీట్ చేస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఈ విషయం చర్చల్లో నిలుస్తుంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే. ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మాటల మంత్రికుడు త్రివిక్రమ్ – హరీష్ శంకర్. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ అరవింద సమేత, బన్నీ అలవైకుంఠపురంలో సినిమాలలో పూజను హీరోయిన్గా తీసుకున్నారు. ఆయన స్వయంగా రికమండేషన్ చేయడంతోనే పూజకు ఈ రెండు సినిమాల్లో అవకాశం వచ్చిందని అంటారు. ఇప్పుడు పట్టుబట్టి మహేష్ బాబు సినిమాకు కూడా కావాలని పూజహెగ్డేనే హీరోయిన్గా తీసుకున్నారు. ఇదంతా త్రివిక్రమ్ కనుసన్నల్లోనే జరిగింది అన్నది వాస్తవం.
ఇక త్రివిక్రమ్ పూజ గురించి రకరకాల వార్తలు పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. పూజ కూడా అన్ని విధాలా త్రివిక్రమ్‌కు సహకరించడంతోనే ఆయన తన సినిమాల్లో ఆమెను ప్రోత్సహిస్తూ వస్తున్నారని అంటున్నారు. ఇక హరీష్ శంకర్ కూడా పూజా హెగ్డేను బాగా వాడుతున్నట్టే కనిపిస్తోంది. గతంలో తాను తీసి తీసిన డీజే – గద్దల కొండ గణేష్ సినిమాలలో ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి.
దీంతో పూజ హరీష్ శంకర్‌కు బాగా కలిసి ఇచ్చిన హీరోయిన్ అయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరీశంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ఆమెనే హీరోయిన్గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. దీనిపై త్వరలోనే అధికారికి ప్రకటన కూడా రానుంది. ఏదేమైనా అటు త్రివిక్రమ్ – హరీష్ శంకర్ ఇద్దరు కూడా పూజా హెగ్డేను బాగా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఇద్దరు స్టార్ డైరెక్టర్లు వరుస ఛాన్సులు ఇవ్వడంతో ఎంత నలుగుతున్నా పూజ కెరీర్ కు మాత్రం ఎప్పట్లో వచ్చిన ఇబ్బంది లేదని చెప్పాలి.