MoviesAnushka-Prabhas: మరోసారి బయటపడ్డ అనుష్క-ప్రభాస్ ప్రేమాయాణం..ప్రేమంటే ఇదేగా..!!

Anushka-Prabhas: మరోసారి బయటపడ్డ అనుష్క-ప్రభాస్ ప్రేమాయాణం..ప్రేమంటే ఇదేగా..!!

టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు కామన్ గా వినిపించే న్యూస్ అనుష్కతో ప్రేమాయణం. స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క .. హీరో ప్రభాస్ ప్రేమించుకుంటున్నారు అంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై ఎప్పటికప్పుడు ఇద్దరు ఈ రూమర్స్ ని కొట్టి పడేస్తూనే ఉన్నారు . కాగా వీళ్ళు ప్రవర్తించే తీరు మాత్రం జనాలకు ఎక్కడో డౌట్ పుట్టిస్తూనే ఉంది.

ఇప్పటికే నాలుగు సార్లు జత కట్టిన ఈ జంట ఐదోసారి రియల్గా జత కట్టాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఇలాంటి మూమెంట్లోనే ప్రభాస్ – అనుష్కలకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్గా ప్రభాస్ తన హెల్త్ బాగోలేని కారణంగా షూటింగ్స్ కు ప్యాకప్ చెప్పేసి షూటింగ్ కు బ్రేక్ వేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు . కాగా ఇదే టైంలో అనుష్క కూడా తాను నటిస్తున్న సినిమా షూటింగ్ ని ఆపేసి మరి ప్రభాస్ ని మీట్ అయిందట.

అంతే కాదు ప్రభాస్ హెల్త్ బాగుండాలి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుందట . ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . అంతేకాకుండా మిర్చి సినిమాలో అనుష్క ప్రభాస్ ని ఎత్తుకున్న సీన్ పై కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది . రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ అయిన పదేళ్ల సందర్భంగా అనుష్క – ప్రభాస్ ఫాన్స్ అనుష్క.. ప్రభాస్ ని ఎత్తుకున్న పిక్ ని ట్రెండ్ చేస్తున్నారు .

అంతేకాదు ఈ సీన్ కి సంబంధించి గతంలో అనుష్క మాట్లాడిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి అనుష్క.. ప్రభాస్ ని డైరెక్ట్ గా ఎత్తుకోలేదు ..మొదట స్టూల్ మీద నిల్చునాక ఆ తర్వాత బ్యాలెన్స్ చేసింది . ఆ టైంలో కొరటాల సైతం అనుష్క ని చూసి షాక్ అయిపోయాడట . ఏది ఏమైనా సరే ఈ జంట మధ్య ప్రేమ ఉన్నా దాన్ని ఒప్పుకోవట్లేదు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలన్నది రెబల్ అభిమానుల కోరిక . మరి చూద్దాం ఈ జంట ఎప్పుడు ఆ కోరిక నెరవేస్తుందో .. ఎప్పుడు అనుష్క ప్రభాస్ ల పెళ్లి జరుగుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news