యుగంధర్ సినిమాలో అన్నగారు నట విశ్వరూపం మరో రేంజ్‌లో మనకు కనిపిస్తుంది. ఈ సినిమాలో అన్న గారు.. రియల్ హీరోగా దర్శనమిస్తారు. అప్పటికే శతాధిక సినిమాలు చేయడం.. దర్శకత్వ రంగంలోనూ తన దైన శైలిలో అన్నగారు విజృంభిస్తున్నారు. ఈ సమయంలో యుగంధర్ సినిమా ప్లాన్‌చేశారు. ఈ సినిమాను మెజారిటీ పార్ట్ అంతా కూడా బొంబాయిలో చేశారు. అప్పట్లో తారాగణం అంతా కూడా ఎక్కువగా అక్కడి వారినే తీసుకున్నారు.
దీంతో ముంబైలోనే చాలా వరకు షూటింగు పూర్తి చేశారు. ఈ క్రమంలో అనేక మంది నటీనటులు నెల రోజులకు పైగానే ముంబైలో ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా జయమాలిని ఈ సినిమాలో కీలక రోల్ పోషించారు. ఒక పాత్ర ధరించారు. అప్పటికి వ్యాంపు పాత్రల్లోనే నటిస్తున్నా.. కీలక పాత్రల్లోనూ జయమాలిని అవకాశం ఇచ్చారు. అయితే.. తారాగణం ఎక్కువగా ఉండాల్సి వచ్చేసరికి బుక్ చేసి న రూమ్‌లు సరిపోలేదు.
దీంతో తారాగణాన్ని రూమ్‌లు పంచుకోమని.. దర్శకుడు.. నిర్మాత కూడా సలహ పడేసి.. వారి రూమ్‌లకు వారు వెళ్లిపోయారు. దీంతో జయమాలిని.. ఎన్టీఆర్ ఒకే రూమ్‌లో ఉండాల్సి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. సినీ స్టాఫ్ అంతా కూడా.. తనను అదో రకంగా చూడడం ప్రారంభించినట్టు జయమాలిని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. నిజానికి ఒక మగ – ఒక ఆడ ఒక రూమ్‌లో ఉంటే.. అనే అపార్థాలు హల్ చేసే రోజులు.
పైగా వ్యాంపు పాత్రలు చేసే జయమాలిని.. దూకుడుగా ఉండే ఎన్టీఆర్ ఒకే రూంలో నైటంతా ఉండాల్సి వస్తే.. సహజంగానే రూమర్లు వచ్చేస్తాయి. వీటిపైనే ఓ సందర్భంలో స్పందించిన జయమాలిని.. తన వెంట ఎప్పుడూ.. తన తల్లి ఉంటుందని.. ఆ రోజు కూడా ఆమె తన వెంటే ఉందని.. ఎన్టీఆ ర్ దైవం వంటి వారని.. తప్పుడు ఆలోచన ఆయన దరి చేరనివ్వరని అన్నారు. అనుకునేవాళ్లు ఎన్ని అనుకున్నా.. ఎన్టీఆర్ మాత్రం తనను బాగానే చూసుకున్నారని చెప్పారు.