విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్.. తెలుగువారి ఫైర్‌బ్రాండ్ నటీమణి భానుమతి కలిసి అనేక చిత్రాల్లో నటించారు. మల్లీశ్వరి నుంచి పల్నాటి యుద్ధం వరకు.. అనేక సాంఘిక, చరిత్రాత్మక చిత్రాల్లో నటించారు. ఇద్దరూకూడా తెలుగు వారి ఇలవేల్పులుగా కీర్తి గడించారు. అయితే.. ఇద్దరూ కలిసి నటించినా .. వీరి మధ్య చాలా వైరుధ్యం ఉండేది. ఆహార నియమాల నుంచి కట్టుబొట్టు వరకు అంతా కూడా చాలా వ్యత్యాసం ఉంది.
ముఖ్యంగా షూటింగుల సమయంలో అప్పట్లో స్టూడియోల్లోనే షూటింగులు జరిగేవి. క్యాంటీన్లు స్టూడియోల్లో ఉన్నప్పటికీ.. హీరో, హీరోయిన్లకు మాత్రం ప్రముఖ హోటళ్ల నుంచి ఆహారం తెప్పించేవారు. భానుమతి ఠంచనుగా 12 గంటలకు భోజనం చేసేవారు. అన్నగారు.. మధ్యాహ్నం 1 గంటకు తినేవారు. 12 కాగానే.. భానుమతి పీఏ ఆమెకు ఎదురుగా వచ్చి కనిపించేవారట. దీంతో వెంటనే ఆమె షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయేవారట.
కానీ, అన్నగారు మాత్రం 1 గంటకు తప్ప.. తినేది లేదని.. మీ కోసం మా అలవాట్లు మానుకునేది లేదని చెప్పేవారట. దీంతోభానుమతి.. ఎవరు ఎప్పుడు తింటే మాకెందుకు.. మా అలవాట్లు మావి
అని దురు సుగా వ్యాఖ్యానించేవారట. ఇక, భోజనాల విషయానికి వస్తే.. బ్రాహ్మణ భోజన హోటల్ నుంచి తీసుకువచ్చిన క్యారెయిర్‌ను మాత్రమే భానుమతి తీసుకునేవారు. అంతేకాదు.. ఆమెకు బిల్లు కూడా చూపించాలట. ఇక, అన్నగారికి ముక్కలేందే కుదరదు.
దీంతో ఆయనకు వేరే హోటల్ నుంచి తెచ్చేవారట. దీంతో బీఎన్ రెడ్డి వంటి దర్శకుడు.. ఒక నిబంధన పెట్టారట. ఇదిగో అమ్మాయ్.. ఏమోవ్ ఎన్టీఆర్ మీ క్యారేజీలు మీరే తెచ్చుకోండి. మేం తీసుకురాం
అని చెపేవారట. దీంతో అప్పటి నుంచి భానుమతి,ఎన్టీఆర్‌లు తమ తమ షూటింగులకు తమ తమ క్యారేజీలు తామే తీసుకువెళ్లేవారట.