నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి సంక్రాంతి చాలా స్పెషల్‌గా నిలిచింది. చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి రెండు సినిమాలతో పాటు రెండు కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అజిత్ తెగింపు సినిమాతో పాటు విజయ్ నటించిన వారసుడు సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది. విజయ్ వారసుడు సినిమాకు మన స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మాత కావడం.. తెలుగు వాడు అయిన వంశీ పైడిపల్లి డైరెక్టర్ కావడంతో వారసుడు కూడా తెలుగులో భారీ ఎత్తునే రిలీజ్ అయ్యింది
ఇక గట్టి పోటీ మధ్య జనవరి 12న వీరసింహారెడ్డి భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చింది. మరుసటి రోజు చిరు వీరయ్య సినిమా ఉండడంతో తొలి రోజు మాత్రం వీరసింహారెడ్డికి ఏపీ, తెలంగాణ, రెస్టాఫ్ ఇండియాతో పాటు తెలుగు మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ భారీ స్క్రీన్లు దక్కాయి. దీంతో పాటు అఖండ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడం, ఇటు బాలయ్యకు అన్‌స్టాపబుల్ క్రేజ్ యాడ్ అవ్వడం, పాటలు ముందే క్లిక్ కావడంతో వీరసింహారెడ్డికి తొలి రోజు అదిరిపోయే వసూళ్లు దక్కాయి.
అసలు బాలయ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని రేంజ్‌లో వీరసింహాకు ఫస్ట్ డే రు. 54 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అసలు ఇది మామూలు రికార్డు కాదు. ఆ తర్వాత రెండో రోజు వీరయ్య రిలీజ్ కావడం.. విజయ్ వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు రావడంతో వీరసింహా జోరు తగ్గినా వసూళ్లలో సత్తా చాటింది. ఓవరాల్‌గా బాలయ్య కెరీర్‌లోనే ఎక్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమా ఫైనల్ రన్ దాదాపు ముగిసిందనే చెప్పాలి.
ఇంకా కొన్ని చోట్ల ఆడుతున్నా కలెక్షన్లు దాదాపు ముగిసినట్టే.. ఓవరాల్గా ఈ సినిమా రు. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్‌లో మిలియన్ మార్క్‌ను మూడు రోజులకే క్రాస్ చేసేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా గ్రాస్ వసూళ్లు చూస్తే రు. 120 కోట్ల వరకు ఉన్నాయి. ఏదేమైనా అఖండ తర్వాత బాలయ్యకు వరుసగా వీరసింహారెడ్డి రూపంలో రెండో హిట్ దక్కింది.