టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ వయస్సులోనూ తిరుగులేని రొమాంటిక్ హీరోయే. నాగార్జున సినిమా కెరీర్ సూపర్‌గా ఉంది. నాగార్జున వ్యక్తిగతం విషయానికి వస్తే ముందుగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీ లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నాగేశ్వరరావు, రామానాయుడు కావాలని పట్టుబట్టి వీరిద్దరి పెళ్లి చేసి వియ్యంకులు అయ్యారు. వీరి సంతానమే నాగచైతన్య, ఈ పెళ్లి జరిగే టైంకు నాగ్ ఇంకా సినిమాల్లో సెటిల్ కాలేదు. చైతు పుట్టాక ఆరేడేళ్లకే వీరి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఈ లోగా మనోడు సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా ఫ్రూవ్ అయ్యాడు.
అప్పటికే శ్రీలక్ష్మితో ఎడబాటు రావడం.. ఇటు తన కో స్టార్ అమలతో పీకల్లోతు ప్రేమలో పడడంతో పాటు శ్రీలక్ష్మికి విడాకులు ఇచ్చాక అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అమలతో నిర్ణయం, శివ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. అమలను పెళ్లి చేసుకుని అఖిల్ పుట్టాక కూడా నాగ్ మరో హీరోయిన్ టబుతోనూ ప్రేమాయణం నడిపాడన్నది అందరికి తెలిసిందే.
ఈ విషయం పక్కన పెట్టేస్తే అఖిల్ పుట్టాక నాగ్‌కు మరో ఆడపిల్ల కావాలన్న కోరిక బలంగా ఉండేదట. నాగ్‌కు ఆడపిల్ల అంటే ఎంతో ఇష్టం. మళ్లీ మరో బిడ్డకు జన్మనిద్దామని అమలతో అంటే అదేంటి మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ? అని నాగ్‌తో అనడంతో ఆశ్చర్యపోవడం నాగ్ వంతు అయ్యిందట. చైతు నీ పిల్లాడు అయినప్పుడు నాకు కొడుకే కదా ? అనడంతో అమల మారు కొడుకు చైతుపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాడట.
ఆ తర్వాత చైతు ఎక్కువ కాలం తన తల్లి శ్రీలక్ష్మి దగ్గరే పెరిగినా తండ్రి నాగార్జున – చైతు విషయంలో మాత్రం వాళ్లకు పూర్తిగా ప్రైవసీ ఇచ్చేదట. అందుకే నాగ్ తనకు మరో ఆడపిల్ల కావాలని కోరినా.. తనకే ఇద్దరు పిల్లలు ఉంటే చైతుపై తన ప్రేమ ఎక్కడ తగ్గుతుందో అని అందుకు ఒప్పుకోలేదనే చెపుతారు. ఇక చైతు ముందు తల్లి వద్దే ఎక్కువ కాలం గడిపినా తర్వాత నాన్న దగ్గరకు రావడం.. నాన్న నాగ్ డైరెక్షన్‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగాయి.