చాలా రోజుల తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతికి గట్టి పోటీ మధ్యలో వచ్చిన వీరయ్య 3 వారాలు కంప్లీట్ అయ్యే టైంకు రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టేసింది. ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతోంది. ఇప్పటి వరకు రు. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసిన వీరయ్య దెబ్బతో చిరు మార్కెట్ స్టామినా బాగా పెరిగిపోయింది. ఈ సినిమాకు ముందు వరకు చిరు మార్కెట్ ఒక రేంజ్‌లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది.
ఈ సినిమాకు ముందు వరకు చిరు ఒక్కో సినిమాకు రు. 50 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఆచార్య, గాడ్ ఫాథర్ లాంటి సినిమాలు ప్లాప్ అయినా చిరు రెమ్యునరేషన్ మాత్రం రు. 50 కోట్ల రేంజ్‌లోనే ఉండేది. అయితే ఇప్పుడు వీరయ్య సాధించిన అప్రతిహత విజయంతో చిరు రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
చిరు ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మిస్తోన్న భోళాశంకర్ సినిమా చేస్తున్నాడు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఇది ఎప్పుడో ఫిక్స్ అయిపోయిన సినిమా. దీనిని పక్కన పెట్టేస్తే చిరు త్వరలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే ప్రాజెక్టులు అన్నింటికి ఏకంగా రు. 80 కోట్లకు పై రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట్ట. అసలు ఇది మామూలు డిమాండ్ కాదు.
సినిమా హిట్ అయితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా నిర్మాతలు బలైపోవాల్సిందే. అలాగే సినిమా కొనుక్కున్న వాళ్లకు ఇబ్బందులు తప్పవు. ఉదాహరణకు గాడ్‌ఫాథర్ హిట్ అయినా రు. 55 కోట్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. వీరయ్య సినిమా బాగుండడంతో పాటు రకరకాల ఈక్వేషన్లతో ఆ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ప్రతి సినిమాకు ఆ స్థాయి వసూళ్లు రావాలంటే కష్టమే. ఏదేమైనా చిరు రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.