టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ అలా మొదలవుతోందో లేదో అప్పుడే బిజినెస్ క్లోజ్ అయిపోయింది. సినిమా కనీసం ఒక్క షెడ్యూల్ కూడా అవ్వలేదు. ఈ యేడాది వస్తుందో ? లేదా వచ్చే సంక్రాంతికి వస్తుందో ? క్లారిటీ కూడా లేదు. అప్పుడే ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ దాదాపు కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంద
అసలు ఇదే ఓ షాకింగ్ న్యూస్ అనుకుంటే.. ఈ లెక్కలు చూస్తుంటే దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రైట్స్ అన్నీ ఒక్కొక్కటిగా సేల్ అయిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రు. 80 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయ్యిందని అంటున్నారు.
ఇక మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ రు. 100 కోట్లకు సేల్ అయిపోయాయి. ఇక వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ బిజినెస్ కూడా అప్పుడే క్లోజ్ అయిపోయింది. ఏరియాల వారీగా ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేసుకుని అమౌంట్ కూడా మాట్లాడేసుకున్నారట. థియేట్రికల్ బిజినెస్ ఏకంగా రు. 200 కోట్లకు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రు. 200 కోట్లు.
ఇటు మహేష్ వరుస హిట్లతో ఉండడంతో పాటు త్రివిక్రమ్‌కు ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాకు ఇంత భారీ ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఈ సినిమా తర్వాత మహేష్‌బాబు రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ చేస్తున్నాడు. ఇటు గత నాలుగు సినిమాలు హిట్లే. ఇవన్నీ కలిసి ఈ సినిమా ఇంకా షూటింగ్ అలా మొదలైందో లేదో ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతోంది.