Moviesలాభం లేదు..ఇక హీరోయిన్ తమన్నా ఆ పని చేయాల్సిందేనా..?

లాభం లేదు..ఇక హీరోయిన్ తమన్నా ఆ పని చేయాల్సిందేనా..?

సోషల్ మీడియాలో గాసిప్స్ రావడం కామన్ .. ఎలాంటి హీరోయిన్స్ కి అయినా సరే అలాంటి తప్పుడు వార్తలు.. తప్పుడు ప్రచారాలు జరిగితేనే కూసింత పబ్లిసిటీ ..తద్వారా ఆఫర్లు కూడా వస్తాయి . అయితే తమన్న విషయంలో దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో తెలిసిందే. డైరెక్టర్స్ ఆఫర్ ఇవ్వడం కాదు ఈమె డైరెక్టర్స్ ని ఆఫర్ అడుక్కునే స్థాయికి పడిపోయింది .

అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో పెరిగిపోతున్న కుర్ర బ్యూటీల కాంపిటీషన్ కి దట్టమైన పోటీ ఇస్తున్నా .. కానీ తమన్నా అందాలను చూసేందుకు.. జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ క్రమంలోనే తమన్నా పెళ్ళి చేసుకుని సెటిలైపోవాలనుకుంటుంది అంటూ వార్తలు వచ్చేసాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు . ఇదే క్రమంలో ఆమెకు అవకాశం ఇవ్వాలనుకున్న అరాకొరా డైరెక్టర్లు కూడా తమన్న పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుంది కదా ఇంకెందుకు ఆఫర్లు అంటూ ఆ ఆఫర్లను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు.

దీంతో తమన్నా కెరీర్ మరింత డిజాస్టర్ గా మారిపోతుంది . ఈ క్రమంలోనే తమన్న పెళ్లిపై ఓ క్లారిటీ ఇవ్వాలంటూ ఫిక్స్ అయిందట . త్వరలోనే ఆమె తన పెళ్లి పై ఓ అఫిషీయల్ న్యూస్ ని జనాలకు చెప్పడానికి సిద్ధంగా ఉంది అంటూ బాలీవుడ్ వీడియో చెప్పుకొస్తుంది. చూద్దాం ఈ పనితో అయినా తమన్న కెరియర్ చక్కబడుతుందో లేదో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news