సాధారణంగా సినిమాలనేవి.. కొన్ని సూపర్ డూపర్ హిట్ కొడతాయి. మరికొన్ని ఫెయిల్ అవుతాయి. వీటికి కథ.. కథనం.. బలా బలాలు. ప్రేక్షకుల అభిరుచి అనేది కీలకం. ఇవే ఏ సినిమానైనా ముందుకు నడిపిస్తాయి. ఒక్కొక్కసారి అన్నీ బాగున్నా.. కూడా.. ప్రేక్షకులు మార్పుకోరుకుంటారు. దీంతో కొన్ని కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో నటశేఖర కృష్ణ సొంత బ్యానర్‌పై చేసిన సినిమా.. దేవదాసు పూర్తిగా విఫలమైంది. దీనిని భారీ బడ్జెట్‌తో తెరకు ఎక్కించారు. అలనాటి అక్కినేని దేవదాసుకు పోటీగా ఈ సినిమాను నిర్మించడం విశేషం.
ఇక, ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్. దేవదాసుగా కృష్ణ.. పార్వతిగా వాణిశ్రీలు చెలరేగి నటించారు. కానీ, పాత కథ.. అందరికీ తెలిసిందే కావడంతో ఈ సినిమా పెద్దగా హిట్ కొట్టలేదు. అయితే.. కృష్ణకు సొంతగా బ్యానర్ ఉంది కాబట్టి ఈ సినిమా హిట్ కాకపోయినా.. ఆయన తన సొంత బ్యానర్‌పై సినిమాలు చేసుకుంటున్నారు. కొంత నష్టపోయినా.. తర్వాత సినిమాల్లో కోలుకున్నారు. కానీ, వాణిశ్రీకి మాత్రం సొంతగా బ్యానర్ లేదు.
ఇక, దేవదాసు విఫలం కావడంతో వాణిశ్రీకి అవకాశాలు భారీగా పడిపోయాయి. ఆమె రేంజ్ పడిపోయింది. పైగా ఆమెను పార్వతిగా ఎవ్వరూ ఊహించుకోలేకపోయారు. సుమారు రెండేళ్లపాటు ఆమె ఖాళీగా ఉన్నారు. దీంతో కృష్ణపై వాణిశ్రీ ఆగ్రహం పెంచుకున్నారు. తనకు దేవదాసుపై అంచనాలు భారీగా చూపించి ఒప్పించారని.. కానీ, అది అట్టర్ ఫ్లాప్ అయిందని.. పోనీ తర్వాతైనా.. తనను పట్టించుకోలేదని.. ఈ సినిమా కారణంగానే తన కెరీర్ ఇబ్బందుల్లో పడిందని వాణిశ్రీ ప్రచారం చేయడం ప్రారంభించారు.
ఒక సినీ ఫంక్షన్‌లో (అంటే.. దేవదాసు కు సంబంధం లేని సినిమా) నేరుగా వాణిశ్రీ ఈ వ్యాఖ్యలే చేశారు. దేవదాసును నమ్మి నా కెరీర్‌ను ఫణంగా పెట్టానని.. కృష్ణ బాగానే ఉన్నారు.. కానీ, నేనే నష్టపోయాను అన్నారు. అయితే.. వాణిశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలపై కృష్ణ-విజయనిర్మల దంపతులు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
జీవితంలోనూ.. సినిమాల్లోనూ ఫెయిల్-సక్సెస్ అనేది కామనేనని.. కానీ, తమ పరువును బజారున పడేశారని.. కోపగింది.. వాణిశ్రీపై సినీనటుల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దీర్ఘ కాలం సాగింది. దాదాపు మూడేళ్ల పాటు కృష్ణ-వాణిశ్రీ ఇద్దరూ కూడా షూటింగులకు దూరంగా ఉన్నారు. కానీ, తర్వాత.. ఓ సినిమాలో చంద్రశేఖర్ అనే దర్శకుడు కారణంగా కలిసి నటించారు.