సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ..అది కచ్చితంగా మెగా డాటర్ శ్రీజ విడాకుల మేటర్ అనే చెప్పాలి . మనకు తెలిసిందే సోషల్ మీడియాలో మెగా డాటర్ శ్రీజ ఎప్పుడు ట్రోలింగ్కి గురవుతూనే ఉంటుంది . పాపం తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ ..జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురవుతూ తన తండ్రి పేరును కూడా చెడగొడుతుంది శ్రీజ అంటూ మెగా ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
మనకు తెలిసిందే మొదట శ్రీజ ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతగాడితో ఓ బిడ్డను కన్నాక డివోర్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంది . ఇతగాడితో ఓ బిడ్డను కనింది .అయితే రీసెంట్గా వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు ఇచ్చినట్లు తెలుస్తుంది . అయితే ఇప్పటివరకు కళ్యాణ్ దేవ్ తో శ్రీజ విడిపోయినట్లు ఎక్కడ అధికారిక ప్రకటన చేయలేదు.
పరోక్షకంగా ఇద్దరు మాటలతో ఆ విషయాన్ని బయటపెడుతున్నారు తప్పిస్తే “మేం డివర్స్ తీసుకున్నాం” అంటూ ప్రకటించ లేదు . అయితే రీసెంట్గా కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కూతుర్ని మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ పెట్టుకోవచ్చాడు . కాగా రీసెంట్ గానే మరోసారి తన డివోర్స్ విషయాని చెప్పకనే చెప్పేశారు . “మనం పక్క వాళ్ళని ఎంత గౌరవిస్తామో ప్రేమిస్తామో ఇంపార్టెంట్ కాదు.. మనల్ని ఆ వ్యక్తి ఎంత ప్రేమిస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం” అంటూ ఓ క్యాప్షన్ పెట్టుకోవచ్చాడు .
దీంతో శ్రీజ – కళ్యాణ్ దేవ్ ని మోసం చేసిందని ..ఆ కారణంగానే శ్రీజకు విడాకులు ఇచ్చాడని కళ్యాణ్ దేవ్ ని సపోర్ట్ చేస్తూ మెగా యాంటీ ఫ్యాన్స్ కళ్యాణ్ దేవ్ కు సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు . అయితే కళ్యాణ్ దేవ్ .. శ్రీజ మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదని.. కేవలం మెగా హీరో అవ్వడానికి ఆమెను ఉపయోగించుకున్నాడని ..ఆ కారణంగానే ఆమెను టార్చర్ చేశాడని ..ఈ బాధలు భరించలాగే శ్రీజ డివోర్స్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మరి వీటిల్లో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ..ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.. అసలు నిజం బయటపెట్టాల్సిందే..!!