ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగిన ఓ తెరవెనక విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. 20 ఏళ్ల క్రితం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్పుడప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నారు. ఈ హీరోలతో సినిమాలు తీసేందుకు ఎంతోమంది స్టార్ ప్రొడ్యూసర్లు క్యూలో ఉన్నారు. ఎన్టీఆర్‌కు సింహాద్రి లాంటి మంచి హిట్ పడింది. అప్పుడే ప్రభాస్‌కు వర్షంతో సూపర్ హిట్ దక్కింది.
ఈ క్రమంలోనే అప్పట్లోనే నైజంలో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఆవుల గిరి ప్రభాస్‌తో సినిమా తీసేందుకు డిసైడ్ అయ్యారట. ఆయన ఒకరోజు ప్రభాస్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు సమక్షంలో ప్రభాస్ కు అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అయితే అది మంచి రోజు కాకపోవటంతో మూడు రోజుల తర్వాత అడ్వాన్స్ తీసుకుంటామని ప్రభాస్ తండ్రి ఆవులగిరికి చెప్పారట. అయితే ఇంతలోనే ఆవుల గిరి అంటే గొట్టని కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ చేత ప్రభాస్‌కు ఫోన్ చేయించి ఆవుల గిరి సినిమా చేయవద్దని చెప్పించారట.
ఎన్టీఆర్ ప్రభాస్‌కు ఫోన్ చేయడంతోనే ప్రభాస్ తన బ్యానర్లో సినిమా చేయలేదని ఆవుల గిరి తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకీ ఆవుల గిరి ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా సినిమా నిర్మించారు. నైజాంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు పంపిణీ చేసి విజయవంతమైన డిస్ట్రిబ్యూటర్ గా పేరున్న గిరి ఎన్టీఆర్ తో మాత్రం ఆంధ్రావాలా లాంటి డిజాస్టర్ సినిమా తీశారు. ప్రభాస్ తండ్రి తనకు ఫోన్ చేసి ఈ సినిమా చేయటం లేదని చెప్పారని… అయితే ఎన్టీఆర్ తో ప్రభాస్‌కు ఫోన్ చేయించినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒక అతను తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని గిరి అన్నారు.
ఆ తర్వాత తాను ప్రభాస్ దగ్గరికి వెళ్లి సినిమా చేయకపోయినా ఇబ్బందేమీ లేదని చెప్పానని… అదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా అక్కడే ఉన్నట్టు ఆవుల గిరి చెప్పారు. కొందరు వ్యక్తులు ప్రభాస్ తన బ్యానర్లో సినిమా చేయకుండా అడ్డుపడినా తనకేమీ కాలేదని.. అయితే తాను త్వరలోనే సిమారంగంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని గిరి చెప్పటం విశేషం.