MoviesJhony జానీ సూప‌ర్ హిట్ సినిమా.. ప‌వ‌న్ చేసిన ఆ చిన్న...

Jhony జానీ సూప‌ర్ హిట్ సినిమా.. ప‌వ‌న్ చేసిన ఆ చిన్న త‌ప్పు వ‌ల్లే ప్లాప్‌.. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌నం..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కెరీర్‌లో చేసిన సినిమాల్లో ప్లాప్ అయిన సినిమాల్లో జానీ ఒక‌టి. 2003 స‌మ్మ‌ర్ కానుక‌గా వ‌చ్చిన ఈ సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ నిర్మించారు. అప్ప‌టికే ప‌వ‌న్‌తో డీప్ ల‌వ్‌లో ఉన్న రేణుదేశాయ్ ప‌వ‌న్‌కు జోడీగా న‌టించారు. ర‌మ‌ణ గోగుల ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది.

ఈ సినిమా ఖుషి త‌ర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని మ‌రీ ప‌వ‌న్ చేశాడు. ఖుషీ సూప‌ర్ హిట్. ఖుషి యూత్‌ను మెస్మ‌రైజ్ చేసేసింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక ప‌వ‌న్‌కు యూత్‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. పైగా ప‌వ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వం అంటే సినిమా మామూలుగా ఉండ‌ద‌నుకున్నారు. లోప‌ల‌కు వెళ్లాక చాలా నీర‌స‌మైన గెట‌ప్‌తో ప‌వ‌న్‌ను చూసిన ఫ్యాన్స్ ఫేస్‌లు మాడిపోయాయి.

అస‌లు ప‌వ‌న్ జీవితంలోనే జానీ మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయింది. అయితే టాలీవుడ్ స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జానీ ప్లాప్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జానీ మంచి స్టోరీ లైన్ అని.. అయితే ఆ సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకుండా.. ఓ చిన్న హీరోతో చేసి ఉంటే సూప‌ర్ హిట్ అయ్యేద‌ని చెప్పారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఈ సినిమా సెట్ కాలేదు. అప్ప‌టికి ఆయ‌న క్రేజ్ తారాస్థాయిలో ఉంది. అదే వేరే హీరోతో చేసి ఉంటే ఖచ్చితంగా జానీ మంచి హిట్ అయ్యేద‌ని ఆయ‌న చెప్పారు. ఇక ప‌వ‌న్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశార‌ని కూడా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మెచ్చుకున్నారు. ఇక జానీ త‌ర్వాత ప‌వ‌న్ మ‌రోసారి త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో స‌త్యాగ్రాహి సినిమా చేయాల‌నుకున్నారు. అయితే ఆ సినిమా కొన్ని కార‌ణాల వ‌ల్ల సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news