బుల్లితెరపై జబర్దస్త్ ఒకప్పటి కమెడియన్గా పేరు సంపాదించుకున్న సుధీర్ కి.. జబర్దస్త్ యాంకర్ రష్మీకి మధ్య ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ ద్వారానే ఈ ఇద్దరు పాపులారిటీ సంపాదించుకున్నారు . పలు షోస్ లో స్కిట్స్ వేస్తూ జంటగా.. యాంకరింగ్ చేస్తూ అలరించిన ఈ జంట ఈ మధ్యకాలంలో దూరంగా ఉంటున్నారు . మరి ముఖ్యంగా సుధీర్ బుల్లితెరపై కనిపించడమే మానేశారు.
అయితే ఈ జంట కనిపించకపోయిన సుధీర్ – రష్మి పర్సనల్గా మీట్ అవుతున్నారని ..వాళ్ళ మధ్య ప్రేమ అలాగే ఉందని అంతా అనుకున్నారు . కాగా రీసెంట్గా రష్మీ – సుధీర్ తో బ్రేకప్ అంటూ అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసింది. రీసెంట్గా ఆమె చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ అయింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఎపిసోడ్లో లవ్ గురించి అందరూ చర్చించుకున్నారు. కొత్త జంటలతో కాబోయే కొత్త జంటలు కూడా ఈ షోలో అలరించారు .
కాగా ఇదే క్రమంలో టాస్క్ లో భాగంగా ఫ్లేమ్స్ చేస్తున్నప్పుడు రష్మి పేరు పక్కన సుదీర్ పేరును ముద్దుగా సిద్దు అంటూ రాయగా ఆమె ఆ పేపర్ ని చించేసారు.. అంతేకాదు ఏడుస్తూ ఉండిపోయారు . ఇదే క్రమంలో రష్మి సుధీర్ తో బ్రేకప్ చెప్పేసిందని.. అదే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిందని లేకపోతే ఇంతవరకు ఎప్పుడు రష్మీ – సుధీర్ పేరుని అలా చేయలేదంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఇది నిజంగానే నిజామా లేదా స్కిట్లో భాగమా అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది . ఒకవేళ నిజంగా సుధీర్ – రష్మీ విడిపోతే వాళ్లకన్నా వాళ్ళని అభిమానించే జనాలు ఎక్కువగా ఫీల్ అయిపోతారు . చూద్దాం సుధీర్ దీని పై ఏ విధంగా స్పందిస్తాడో..?