MoviesYasaswi ఓ మై గాడ్: స్టార్ సింగర్ యశస్వి ఇంత జాదుగాడా..బయటపడ్డ...

Yasaswi ఓ మై గాడ్: స్టార్ సింగర్ యశస్వి ఇంత జాదుగాడా..బయటపడ్డ పచ్చి మోసం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే బుల్లితెరపై ప్రసారమయ్యే సింగింగ్ ఐకాన్ సరిగమప షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు యశస్వి కొండేపూడి. గతంలో ఈ పేరు జనాలకి చాలా తక్కువ మందికే తెలుసు . ఎప్పుడైతే సరిగమప సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాడో..జాను సినిమా నుండి పాట పాడాడో.. అప్పటినుంచి యశస్వి కొండేపూడి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతుంది.

ఆ పాట పాడిన తర్వాత ఈయనకి సోషల్ మీడియాలో హ్యూజ్ ఫాలోయింగ్ పెరిగిపోయింది . ఇంస్టాగ్రామ్ లో , యూట్యూబ్ లో , ట్విట్టర్లో యశస్వి కొండేపుడిని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య స్టార్ హీరోని మించిపోయే రేంజ్ లోనే ఉంటుంది . తాజాగా ఈఅయనకు సంబంధించిన నిజ స్వరూపం బయటపడింది . ఇటీవల ఒక టెలివిజన్ షో పాల్గొన్న యశస్వి ..నవసేవ ఎన్జీవో తరఫున కొంతమంది చిన్నారులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

అయితే సింగల్ యశస్వి చెప్పిన మాటలను నవసేవ ఎన్జీవో నిర్వాహకురాలు తప్పు పట్టారు. ఇప్పటివరకు యశస్వి కొండేపూడి ఎవరిని చదివించట్లేదని ఆయన చెప్పిందంతా అబద్ధాలే అని తేల్చేశారు . నవసేవ ఎన్జీవో తో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని కరాకండిగా చెప్పేశారు. బుధవారం సోమాజిగూడలో గల ప్రెస్ క్లబ్లో ఈ విధంగా చెప్పుకు రావడం సంచలనంగా మారింది. జనాలు చేత తన ఇమేజ్ పెంచుకునేందుకు ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేశారు అంటూ ఆమె మండిపడింది. దీంతో ఆ మోసం బయటపడింది . ఈ క్రమంలోనే నవసేవ ఎన్జీవో పేరిట యశస్వి డబ్బులు కూడా వసూలు చేశాడా..? అన్న సందేహాలు జనాలకు కలుగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు యశస్వి కొండేపూడి స్పందించకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news