కాస్త ఏజ్ కనిపించే హీరోయిన్స్‌ను మన మేకర్స్ దూరం పెట్టడానికి చాలా కారణాలు వెతుక్కుంటుంటారు. హీరోయిన్‌గా మంచి కెరీర్ గ్రాఫ్‌ను మేయిన్‌టైన్ చేసిన వారినైతే కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారు వెతికి మరీ తీసుకొచ్చి మంచి పాత్రలిచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. సీనియర్ హీరోయిన్స్‌కి కావాల్సింది అవకాశం అలాగే రెమ్యునరేషన్.
ఇవి రెండూ ఉంటే దాదాపు చాలామంది హీరోయిన్‌గా కనుమరుగైనా మళ్ళీ క్యారెక్టర్స్‌తో సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఇక మరికొందరు పెళ్ళి తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అక్క వదిన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తున్నారు. ప్రేమ, ప్రియమణి లాంటి వారు అదే గ్లామర్‌ను మేయిన్‌టైన్ చేస్తూ సెకండ్ లీడ్ దొరికితే వదలడం లేదు.
కనీసం మంచి ప్రాముఖ్యమైన పాత్ర దొరికినా చాలని ఆరాటపడుతున్నారు. ఇక సెక్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న భూమిక చావ్లా అయితే వదిన పాత్రలు చేసినా ఫొటో షూట్స్ మాత్రం అప్‌కమింగ్ హీరోయిన్‌లా చేస్తోంది. 20 ఏళ్ల క్రితం ఆమె ఇప్పటి స్టార్ హీరోలు పవన్, ఎన్టీఆర్, మహేష్‌కు హిట్లు ఇచ్చిన సూపర్ హీరోయిన్. అయితే ఇప్పుడు ఆమె నాని లాంటి హీరోలకు వదినగా, మరి కొందరు యంగ్ హీరోలకు అక్కగా కూడా చేస్తోంది.
మత్తుకళ్ళతో తొడ అందాలను చూపిస్తూ కెమెరాలకి ఫోజులిస్తోంది. భూమిక మొహంలో కాస్త ముసలితం కనిపిస్తున్నప్పటికీ మేకప్‌తో కవర్ చేస్తే గ్లామర్ మాత్రం బాగానే ఉందనిపిస్తోంది. సీనియర్ హీరోలు గనక అవకాశం ఇస్తే వారితో రొమాన్స్ చేయడానికి భూమిక రెడీ అంటోంది. ఇప్పుడు కూడా నడుము చూపించే ఇంటెన్సివ్ సీన్స్‌లో నటించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుందని తన లేటెస్ట్ ఫొటో షూట్స్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతోంది. మరి ఈ నాభి సిందరిని మళ్ళీ రొమాంటిక్ సీన్స్‌లో చూపించే దర్శకుడెవరో చూడాలి.