దర్శకరత్న దాసరి నారాయణరావు, దిగ్దర్శకుడు రాఘవేంద్రరావు.. తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంత లు తొక్కించారనడంలో సందేహం లేదు., అనేక చిత్రాలు తీసిన ఈ ఇద్దరు దర్శకులకు ఎంతో పేరుంది. అలాగే.. వీరి శిష్యులు అనేక మంది దర్శకులుగా రాణించారు. అనేక హిట్ చిత్రాలను కూడా అందించా రు. అయితే.. ఈ ఇద్దరు దర్శకుల విషయంలో అన్నగారు ఎన్టీఆర్‌కు మరో ప్రత్యేక స్థానం ఉంది.
అదేంటంటే.. ఎన్టీఆర్ వయసు 55 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఆయనను హీరోగా తీసుకునేందుకు నిర్మా తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. ఎన్టీఆర్ ఫిజిక్ చూస్తే.. ఆయన పెద్దగా ఇప్పటిలాగా సిక్స్ ప్యాక్ కోసం ఎలాంటి కసరత్తులు చేయలేదు. ప్రత్యేకంగా ట్రైనర్‌ను కూడా నియమించుకోలేదు. పైగా ఆహార నియమాలు కూడా పాటించేవారు కాదు. తనకు నచ్చిన ఆహారాన్ని సుష్టుగా భోంచేశారు.
దీంతో ఎన్టీఆర్‌కు ఆ వయసులో పొట్ట కనిపించేది. అయితే.. అప్పటికే తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరు చి కూడా అంతో ఇంతో మారుతోంది. అయినప్పటికీ.. ఎన్టీఆర్ అంటే అభిమానమే. ఇలాంటి సమయంలో అన్నగారిని డిఫరెంట్ రోల్లో చూపించేందుకు దాసరి, రాఘవేంద్రరావులు ప్రయత్నించారు. వీరికి ఆయనతో చేయాలన్న అభిలాష.. మరోవైపు.. అన్నగారికి తనను తాను మరోసారి నిరూపించుకోవాలనే భావన. దీంతో ఈ ఇద్దరు దర్శకులతో ఒక దశాబ్దం పాటు అనేక చిత్రాలు చేశారు.
ముఖ్యంగా హీరోయిన్ వయసు 20-24 ఏళ్లలోపు ఉంటే.. అన్నగారి వయసు 55 ఏళ్లు ఉండేది. అయినప్పటి కీ.. కొన్ని క్లోజ్ షాట్లు, కొన్ని లాంగ్ షాట్లు తీయడంతోపాటు.. విదేశాల నుంచి కాస్ట్యూమ్ డిజైనర్లను పిలిచి మరీ అన్నగారికి ప్రత్యేకంగా దుస్తులు తయారు చేయించారు. దీంతో బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, అడవి రాముడు వంటి చిత్రాల్లో అన్నగారు నటించి మెప్పించారు. ఈ విషయాన్ని అన్నగారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. దాసరి అంటే.. ప్రత్యేక అభిమానం. ఇక, రాఘవేంద్రరావు మా మావాడే అంటూ.. అన్నగారు ప్రత్యేకంగా చెప్పేవారు.