కళాతపస్వి కె విశ్వనాథ్ ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆయన జ్ఞాపకాలకు నీరాజనం పడుతున్నారు. అంత గొప్పగా విశ్వనాథ్ తెలుగు సినీ ప్రేమికుల మాత్రమే కాదు.. తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఎన్నో ఆణిముత్యాలను అందించిన విశ్వనాథ్ కెరీర్లో శంకరాభరణం – సాగర సంగమం లాంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పటికీ అజరామంగా నిలిచిపోయాయి. అలాగే సిరివెన్నెల కూడా మరో మెచ్చుతునక. అలాగే స్వాతికిరణం సినిమా కూడా అంతే గొప్ప సినిమా
అసలు కమలహాసన్ లాంటి స్టార్ హీరో విశ్వనాథ్ కు దత్తపుత్రుడు లాంటివాడు. అందుకే నిన్న విశ్వనాథ్ మృతి చెందిన వెంటనే కమల్ తన గురువుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. విశ్వనాథ్ కెరీర్ లో కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో బాలయ్య హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమా ఒకటి. విశ్వనాథ్ ఈ కథను ముందుగా రాసుకున్నాడు.
ఆకట్టుకునే కథతో పాటు మంచి పాటలు రెడీ అయ్యాయి. ఓ ఆదర్శవంతమైన యువకుడి కథ ఇది. విశ్వనాథ్ కు బాగా మెచ్చిన సుమలత – రాజ్యలక్ష్మి ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. అయితే ఈ సినిమాలోకి బాలయ్య హీరోగా ఎంటర్ కావడం వెనక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. బాలయ్య నటుడుగా అప్పుడప్పుడే పాపులర్ అవుతున్నాడు. బాలయ్యను కేవలం మాస్ హీరోగా మాత్రమే కాకుండా.. భిన్నమైన హీరోగా కూడా జనాలకు పరిచయం చేయాలన్న తాపత్రయం ఎన్టీఆర్‌కు ఉంది.
ఇక ఎన్టీఆర్ విశ్వనాథ్ మీద ఒత్తిడి చేసి బలవంతంగా ఈ ప్రాజెక్టులోకి బాలయ్యను తీసుకువచ్చారని అంటారు. విశ్వనాథ్‌కు బలవంతంగా ఈ ప్రాజెక్టు అప్పగించడంతో ఆయన కూడా మనసుపెట్టేందుకు వీలు లేకుండా ఈ సినిమా చేశాడని అంటారు. ఏదేమైనా సినిమా ఫట్ అయ్యింది. అలా బాలయ్య – విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఒక్కగానొక్క సినిమా చేదు ఫలితాన్నే ఇచ్చింది.