లోకనాయకుడు, ఉలగనాయకన్ కమల్‌హాసన్ ఎంతో గొప్ప హీరో. భారతదేశం గర్వించదగ్గ గొప్ప హీరోల లిస్టులో కమల్ ఖచ్చితంగా ఉంటాడు. కయల్ చేసినన్ని ప్రయోగాలు ఏ స్టార్ హీరో కూడా చేయలేదు. అంత దమ్మున్న హీరోలే లేరు. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా కమల్ ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు. కమల్ కెరీర్ స్టార్టింగ్ నుంచి గతేడాది వచ్చిన విక్రమ్ వరకు అలాగే వెళ్లాడు. తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న కమల్ వ్యక్తిగత, వైవాహిక జీవితాల విషయంలో మాత్రం ఎప్పుడూ వివాదాలు, మైనస్లతోనే ఉండేవాడు.
కమల్ ప్రేమించిన వారి లిస్ట్ చాలా పెద్దగా ఉంది. కమల్‌కు గౌతమితో అధికారికంగా పెళ్లి జరగకపోయినా.. ఆ సహజీవనం కూడా కలిపి చూస్తే ముగ్గురు భార్యలు ఉన్నట్టే లెక్క. అసలు కమల్ ఎఫైర్లు పెట్టుకున్న హీరోయిన్ల లిస్ట్ ఓ సారి చూస్తే ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కమల్ ముందుగా 1978లో వాణీ గణపతిని పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల పాటు ఆమెతో కాపురం చేశాక 1988లో విడాకులు ఇచ్చేశాడు.
ఆమెకు విడాకులు ఇవ్వకముందే అప్పట్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న సారికతో డేటింగ్ చేయడం.. ఆమెకు ప్రెగ్నెన్సీ రావడం జరిగిపోయాయి. ఆ బిడ్డే శృతీహాసన్. సారికతో చాలా రోజులు ఉన్నాక ఆమెకూ విడాకులు ఇచ్చేసి గౌతమితో 14 ఏళ్ల పాటు సహజీవనం చేశాడు. అసలు గౌతమి – కమల్ ఎప్పుడో ప్రేమించుకున్నారు. సారిక కంటే కమల్.. గౌతమినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడట.
చివరకు అటూ ఇటూ తిరిగి గౌతమికి మరో వ్యక్తితో పెళ్లి జరగడం.. విడాకులు తీసుకుని.. మళ్లీ కమల్‌తో పాత ప్రేమ చిగురించి సహజీవనం చేయడం.. మళ్లీ ఇద్దరి మధ్య అనుమానాలు పెరిగి విడిపోవడం జరిగింది. అయితే కమల్ విషయంలో ఈ మూడు అందరికి తెలిసిన విషయాలు.. మరో ముగ్గురు హీరోయిన్లతోనూ కమల్ ఎఫైర్లు నడిపాడని అంటారు. ఇవి చాలా మందికి తెలియదు.
ఒకప్పటి నటి శ్రీ విద్య కమల్‌ను పిచ్చిగా ప్రేమించింది. శ్రీ విద్య కమల్‌ను ఆరాధించింది.. సర్వస్వం అర్పించేసింది. చివరకు పెళ్లి చేసుకోమని అడిగితే… మనిద్దరం స్నేహితులుం.. అంతకు మించి ఏం లేదని చెప్పి తప్పించుకున్నాడు. కమల్ ఇచ్చిన షాక్‌తో శ్రీ విద్య చాలా రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయిందనే అంటారు. ఆ తర్వాత 2000వ దశకంలో సిమ్రాన్తోనూ కమల్ చాలా క్లోజ్‌గా ఉండేవాడని.. ఆమెతోనూ ప్రేమాయణం నడిపాడని కోలీవుడ్ మీడియా కోడై కూసింది..
అంటే సారికను వదిలించుకునే చివర్లో సిమ్రాన్‌తో వ్యవహారాలు నడిపాడడని అంటారు. ఇక గౌతమితో బ్రేకప్ టైంలో తనతో రెండు సినిమాల్లో చేసిన అమెరికా అమ్మాయి పూజాకుమార్తోనూ ఏదేదో రిలేషన్ ఉందని అంటారు. ఏదేమైనా కమల్ ఎంత గొప్ప నటుడో ? అంతకు మించి అమ్మాయిల విషయంలో మంచి చిలక్కొట్టుడు గానే అని అంటారు. ఆయన జీవిత పరిణామాలే ఇందుకు సాక్ష్యాలు.