కే బాలచంద్రగా ప్రసిద్ధి చెందిన కైలాసం బాలచందర్ దక్షిణ భారతదేశంలోనే కాదు జాతి స్థాయిలో గుర్తింపు పొందిన గొప్ప దర్శకుడు.. రచయిత, నిర్మాత. 1930వ సంవత్సరంలో తమిళనాడులోని తంజావూరు జిల్లా నన్నిలం గ్రామంలో బాలచందర్ జన్మించారు. 45 సంవత్సరాల సినిమా ప్రయాణంలో బాలచందర్ తెలుగు – తమిళ – హిందీ – కన్నడ భాషల్లో 100కు పైగా సినిమాలను రూపొందించారు. ఇప్పుడు జాతీయస్థాయిలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ – కమలహాసన్ – ప్రకాష్ రాజు లాంటి గొప్ప నటులను సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత కూడా బాలచందర్‌దే.
బాలచందర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2017 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయనను సత్కరించింది. 84 సంవత్సరాల వయసులో బాలచందర్ 2014లో చెన్నైలో మృతి చెందారు. అప్పట్లో కేవలం హీరోయిజంతో నిండిన కథలతోనే సినిమాలన్నీ తెరకెక్కేవి. అంటే సినిమా కథలన్నీ పురుష ప్రధానంగానే సాగుతూ ఉండేవి.
ఈ పంథాను మార్చటానికి తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి బాలచందర్ మధ్యతరగతి కుటుంబాలను వారి ఆశలు.. ఆశయాలతో పాటు ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎంచుకున్నారు. బాలచందర్ సినిమాలలో ఎక్కువగా వాస్తవికతకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆయన తిరుగులేని దర్శకుడుగా ఎదిగారు. బాలచందర్ ఎంతో గొప్ప దర్శకుడు. ఆయనకు అంత గొప్ప పేరు రావడానికి మరో చరిత్ర సినిమా కారణం.
కమలహాసన్ – సరిత జంటగా నటించిన ఈ విషాదంతా ప్రేమ కథ అప్పట్లో సౌత్ ఇండియా యువతను పిచ్చపిచ్చగా ఆకట్టుకుంది. కెరీర్‌లో ఎలాంటి వివాదాలు లేని బాలచందర్‌పై ప్రేమ రూమర్లు వచ్చాయి. ఆయన ఓ ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్లు నడిపాడన్న రూమర్లు ఉన్నాయి. అయితే ఆయన దర్శకత్వంలో వహించిన ఎన్నో సినిమాల్లో నటించిన మన తెలుగు నటి కాకినాడ శ్యామల ఆయన కూడా మగాడే కదా.. ఆయనకు అమ్మాయిల వీక్‌నెస్ ఉందని తన తాజా ఇంటర్వ్యూలో ఆ గుట్టు విప్పేశారు.
ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో కాదు.. మరో చరిత్ర సినిమాతో పాపులర్ అయిన సరితతో పాటు మరో సీనియర్ హీరోయిన్ గీతతో ఆయనకు ఎఫైర్లు ఉన్నాయని కాకినాడ శ్యామల కుండబద్దలు కొట్టేశారు. అయితే సరిత – బాలచందర్ గురించి అప్పట్లోనే రకరకాల రూమర్లు ఉన్నమాట నిజం. అలాగే గీతతోనూ ఆయన ఎఫైర్ నడిపాడని ఆమె బయట పెట్టారు.