కరోనా టైంలో సినిమా బిజినెస్ బాగా డల్ అయ్యింది. ఇక ఇప్పుడిప్పుడే మంచి కథాబలం ఉన్న సినిమాలు హిట్ అవుతుండడంతో మళ్లీ సినిమా బిజినెస్‌కు కొత్త కళ వచ్చేసింది. దీంతో హీరోల నుంచి, దర్శకులు, హీరోయిన్ల రెమ్యునరేషన్లు బాగా పెరిగిపోతున్నాయి. పెద్ద హీరోల రేట్లు చూస్తుంటే మామూలుగా లేవు. ఇక మీడియం రేంజ్ హీరోలు కూడా రు. 20 కోట్ల రేషియోలో అడుగుతున్నారు. ఇక చిన్నాచితకా హీరోలు కూడా ఇప్పుడు రు. 5 కోట్లు కావాలని.. పైసా తగ్గినా నో అని చెప్పేస్తున్నారు.
అసలు సరైన హిట్, మార్కెట్ లేని నాగశౌర్య రెమ్యునరేషనే రు. 4 కోట్లు దాటేసింది. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో విశ్వక్‌సేన్ అయితే ఏకంగా నాలుగున్నర కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. విశ్వక్‌సేన్‌కు ఓ మోస్తరు మార్కెట్ ఉంది. యూత్‌లో క్రేజ్ ఉంది. సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్ల వరకు పర్వాలేదు. అయితే ప్లాప్ అయితే పట్టించుకునే వాడే ఉండడు.
మనోడు ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదట. సినిమాకు నాలుగున్నర కోట్లు ఇస్తేనే కాల్షీట్లు ఇస్తానని ఖరాఖండీగా చెప్పేస్తున్నాట్ట. ప్రస్తుతం విశ్వక్ నటించిన ఢమ్కీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇది ఓన్ మూవీ. ఆ తర్వాత సితార సంస్థలో ఓ సినిమా ఉంటుంది. ఈ సినిమా తర్వాత మరే సినిమాకు సైన్ చేయలేదు. కారణం రెమ్యునరేషన్ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకపోవడమే అంటున్నారు.
విశ్వక్‌సేన్‌కు హైదరాబాద్‌తో పాటు నైజాంలో కాస్త మార్కెట్ ఉంది. మనోడికే నాలుగున్నర కోట్లు ఇస్తే.. నిర్మాణం.. ఇతర నటీనటులతో కలుపుకుంటే సినిమాకు రు. 15 కోట్ల వరకు అవుతుంది. నాన్ థియేట్రికల్, థియేటర్ మీద రు. 15 కోట్లు అంటే కష్టమే..! అందుకే నిర్మాతలు రు. 2 లేదా రెండున్నర కోట్లు ఇచ్చేందుకే వెనకా ముందు ఆలోచన చేస్తుంటే మనోడు ఏకంగా నాలుగున్నర కోట్లు అంటే నిర్మాతలు కూడా జంకుతున్నారట.
విశ్వక్ ముందుగా రెమ్యునరేషన్ కంటే.. కాస్త కథల ఎంపికమీద కాన్‌సంట్రేషన్ చేస్తే రెండు, మూడు హిట్లు పడితే రెమ్యునరేషన్ ఆటోమేటిక్‌గా వాళ్లే పెంచేస్తారు. అలా కాకుండా ముందుగా కథలను వదిలేసి.. రెమ్యునరేషన్ వెంటపడితే కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి విశ్వక్ ఏ రూట్లో వెళతాడో ? చూడాలి.