ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే బడా స్టార్ బ్యూటీస్ అందరూ వరుసగా జబ్బులకు గురవుతున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ స్టార్ స్టేటస్ కలిగిన వ్యక్తులే ఇలా రకరకాల వ్యాధులకు గురవుతూ ఉండడం సినిమా ఇండస్ట్రీలో షాకిం గా ఉంది . కేవలం స్టార్ హీరోయిన్స్ కాదు హీరోస్ కూడా పలు వ్యాధులకు గురవుతూ ఉండడం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన తగ్గ విషయం .
కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి కూడా వ్యాధి ఉందట . వ్యాధి అంటే అదేదో భయంకరమైనది కాదు .. చాలా ఫన్నీగా చెప్తే నవ్వుకునే లాంటిది . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులర్ అయ్యింది. మరీ ముఖ్యంగా అనుష్క శెట్టి – ప్రభాస్ కలిసి చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ అయ్యాయి.
వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే అనుష్కకి ఉన్న వింత వ్యాధి గురించి బయటపడింది. అనుష్క కి ఏదైనా ఫన్నీ సీన్ వచ్చినా.. కామెడీ పంచ్ చెప్పినా.. నవ్వితే కంటిన్యూగా 15 నిమిషాలు నవ్వుతూనే ఉంటుందట . దానికి బ్రేక్ వేయదట .. అనుష్కకి నవ్వొస్తే ఆపుకోవడం కష్టమని .. ఆమెతో వర్క్ చేసిన వాళ్లు ఇదే చెబుతున్నారు. ఇదే సందర్భంగా ఎన్నోసార్లు షూట్ లో ఆమె వల్ల ఎన్నో సీన్స్ కూడా మిస్ అయ్యాయని.. అదేవిధంగా అనుష్క ఎక్కడ ఉంటే అక్కడ చాలా ఫన్నీగా ఉంటుందని తోటి నటీనటులు చెప్పుకొస్తున్నారు . కాగా ఇది తెలుసుకున్న స్టార్ హీరోస్ అనుష్క లాగే నవ్వేస్తున్నారు . అనుష్కకి ఇలాంటి వింత వ్యాధి ఉందా మాకు తెలియదే అంటూ ఫన్నీగా కౌంటర్స్ చేస్తున్నారు..!!