Moviesఈ కన్నడ పిల్ల మామూల్ది కాదు రా బాబు..వాలెంటైన్స్ డే రోజు...

ఈ కన్నడ పిల్ల మామూల్ది కాదు రా బాబు..వాలెంటైన్స్ డే రోజు ఏం చేసిందో తెలుసా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో కన్నడ ముద్దుగుమ్మల రాజ్యం ఎలా ముందుకెళ్తుందో అందరికీ తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నా సరే.. స్టార్ హీరోయిన్స్ గా ఉన్న ఐదు మందిలో నలుగురు ముద్దుగుమ్మలు కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఉండడం ఆశ్చర్యకరమని చెప్పాలి. మరి ముఖ్యంగా నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. ఓకే ఒక్క సినిమాతో తన కెరీర్ ని టోటల్ మార్చేసుకుంది.

బన్నీ హీరోగా నటించిన పుష్ప సినిమాలో నటించిన రష్మిక మందన.. ఒకే ఒక్క సినిమాతో తన జాతకాన్ని తిరగరాసుకుంది. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన ..ఆ రేంజ్ సినిమాలనే ఓకే చేస్తుంది . కాగా గత కొంతకాలంగా రష్మిక మందన రౌడీ హీరో విజయ్ దేవరకొండ .. మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ వాలెంటైన్స్ డే కు వాళ్ళ ప్రేమను అఫీషియల్ గా బయట పెడతారు అంటూ కొందరు జనాలు చెప్పుకొచ్చారు.

అయితే కన్నడ పిల్ల మహా తెలివైనది.. రష్మిక మందన – విజయ్ దేవరకొండ తో ఎక్కడ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా ఆయనకు ఎంతో ఇష్టమైన తన ఫేవరెట్ పప్పీ తో దిగిన ఫొటోస్ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాదు హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ చెప్పుకొచ్చింది.. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ పేరు బయట పెట్టకుండా ఆయనకు ఎంతో ఇష్టమైన పెట్ ని దగ్గర తీసుకుంటూ.. హగ్ చేసుకుంటూ తనతో సరదాగా గడిపిన మూమెంట్స్ ని చిన్న వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది.

దీంతో విజయ్ దేవరకొండ రష్మిక మధ్యలో ప్రేమ కన్ఫర్మ్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . అయితే ఆ విషయాన్ని ఓపెన్ గా విజయ్ దేవరకొండ పేరు చెప్పి ఉంటే బాగుండేది అంటున్నారు మరి కొంతమంది ఫ్యాన్స్.. చూద్దాం ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ బయటపడుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news