తెలుగులో ఇప్పుడంటే చాలా మంది పాప్ సింగర్లు వచ్చారు గాని.. 25 ఏళ్ల క్రితం పాప్ సింగర్లు అంటే అదో స్పెషల్ క్రేజ్. అందులోనూ తెలుగు అమ్మాయి పాప్‌సింగర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఎంతో గట్స్ ఉండాలి. కానీ అది చేసి చూపించింది సింగర్ స్మిత. ఈటీవీ పాడుతా తీయగా రెండో సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చింది స్మిత. ఆ తర్వాత ఆమె పలు ఆల్బమ్స్ చేసి సూపర్ పాపులర్ అయిపోయింది. సినిమాల్లోనూ కొన్ని సాంగ్స్ చేసింది.
ముఖ్యంగా 2000ల్లో వచ్చిన హాయ్‌రబ్బా ఆల్బమ్ ఆమెను తిరుగులేని పాప్‌స్టార్‌ను చేసేసింది. ఇక స్మితకు హీరోలు అల్లరి నరేష్, నానితో మంచి స్నేహం, బంధుత్వాలు ఉన్నాయి. స్మిత హాయ్ రబ్బ ఆల్బమ్ రిలీజ్ అయిన ఏడాదికే అల్లరి నరేష్ తొలి సినిమా అల్లరి ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూ వస్తోంది. విచిత్రం ఏమిటంటే అల్లరి నరేష్ భార్య స్మితకు కజిన్. ఈ లెక్కన చూస్తే నరేష్‌కు స్మిత వరుసకు వదిన అవుతారు.
అలాగే నేచురల్ స్టార్ నానితో కూడా తనకు మంచి రిలేషన్ ఉందని.. నానితో పాటు నాని భార్య అంజు, నాని తండ్రితో తాను చాలా క్లోజ్ గా ఉంటానని.. వాళ్లంతా తనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని స్మిత చెప్పుకొచ్చింది. అలాగే స్మిత భర్త శశాంక్‌కు నానికి మధ్య బంధుత్వం ఉండడంతో స్మిత – నాని కూడా బంధువులు అవుతారు. తమ మధ్య చుట్టరికం కంటే ఒకే కుటుంబం అన్న భావన మరింత దగ్గర చేసిందని స్మిత తెలిపింది.
అలాగే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుతో కూడా ఎప్పటినుంచో మంచి స్నేహం ఉందని స్మిత చెప్పింది. వీళ్లంతా తమ ఫ్యామిలీలో భాగం అని.. వీరిని స్నేహితులు అని అని చెప్పలేనని స్మిత గర్వంగా తెలిపింది. ఇక స్మిత వాళ్ళ తల్లి స్వస్థలం ఖమ్మం కావడం విశేషం. అందుకే ఆమెకు ఖమ్మంతో ఎక్కువగా బంధుత్వాలు ఉన్నాయి.