MoviesSmitha ఇంట్రెస్టింగ్: స్మిత తో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏమిటో...

Smitha ఇంట్రెస్టింగ్: స్మిత తో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?

పాప్ సింగర్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో పాటలు పాడుతూ ప్రైవేట్ ఆల్బమ్స్ తో సినిమాలో మంచి మంచి సాంగ్స్ పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది స్మిత. తాజాగా నిజం విత్ స్మిత అంటూ ఓ సరి కొత్త టాక్ షో ని ప్రారంభించింది . ఈ షోకు ప్రముఖ సెలబ్రిటీస్ అయిన చిరంజీవి , సాయి పల్లవి , నారా చంద్రబాబు నాయుడు లాంటి బడా బడా స్టార్స్ అందరూ వరుసగా వస్తుండడంతో స్మిత పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

ఈ క్రమంలోనే స్మిత బ్యాగ్రౌండ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . కాగా స్మిత భర్త పేరు శశాంక్ . వీళ్లది ప్రేమ వివాహం . అయితే చాలా సైలెంట్ గా ఉండే స్మిత ఇలా ప్రేమ వివాహం చేసుకోవడడం వెనుక అక్కినేని వారసుడు ఉన్నాడు అంటూ తెలుస్తుంది. అయితే చాలా సైలెంట్ గా ఉండే స్మిత ప్రేమకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్గా ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత ఆ విష్యాని ఓపెన్ గా చెప్పేసింది.

ఆమె మాట్లాడుతూ ..మా పెళ్లి జరగడానికి కారణం అక్కినేని వారసుడు అంటూ చెప్పి షాక్ ఇచ్చింది . “అక్కినేని నాగార్జున అన్నయ్య వెంకట్.. స్మిత పెళ్లిని దగ్గరుండి జరిపించారట . శశాంక్ ఇంట్లో స్మిత వాళ్ళ ఇంట్లో చెప్పి మరి ఒప్పించి వాళ్ళ పెళ్లిని చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే ఇప్పటికి అక్కినేని ఇంట్లో పలు ఫంక్షన్స్ అయినా .. పార్టీ అయినా ..అక్కినేని ఫ్యామిలీతో స్మిత మింగిల్ అవుతూనే ఉంటుంది “అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . పాప్ సింగ్ స్మిత లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news