ఎస్ ఈ విషయమే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. పవన్ సినిమా కెరీర్ మొత్తం ఆ ఒక్కడే నాశనం చేస్తున్నాడట. పవన్ కూడా అతడి మాటలే విని తన అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అతడు ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. భీమ్లానాయక్ సినిమాకు త్రివిక్రమే మాటలు, స్క్రీన్ ప్లే ఇచ్చాడు. ఇందుకు గాను త్రివిక్రమ్‌కు ముట్టాల్సింది అంతా ముట్టేసింది.
అందుకే ఈ సినిమా చాలా స్పీడ్‌గా షూటింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత పవన్ నటిస్తోన్న సినిమాలను ఓ సారి చూస్తే దర్శకుడు క్రిష్ పవన్‌తో సినిమా అనుకుని అడ్డంగా బుక్ అయిపోయినట్టే ఉంది. అసలు హరిహర వీరమల్లు సినిమా విషయంలో త్రివిక్రమ్ హ్యాండ్ లేదు. అందుకే ఆ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు.
హరిహర షూటింగ్‌ను పవన్ మధ్యలో వదిలేసి ఇప్పుడు కోలీవుడ్ రీమేక్ మూవీ వినోదయం సీతంకు వెళ్లిపోతున్నాడు. ఈ సినిమా కోసం పవన్ 20 రోజుల కాల్షీట్లు ఇచ్చారంటున్నారు. ఇది పూర్తయ్యాక హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్స్‌మీదకు వెళ్లాలి. అసలు హరీష్ శంకర్ సినిమా కంటే ముందే ఉస్తాద్ అనుకున్నారు. కానీ వినోదయ సీతం రీమేక్ తెరవెనక అంతా త్రివిక్రమ్ కనుసన్నల్లోనే నడుస్తోంది. అందుకే హరిహరను మధ్యలో వదిలేసి మరీ పవన్ ఈ సినిమాకు డేట్లు ఇచ్చేశాడంటున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత సుజిత్ డైరెక్షన్‌లో ఓజి సినిమా కూడా ఉంది. ఇది కూడా త్రివిక్రమ్ సెట్ చేసిందే అంటున్నారు. అంటే త్రివిక్రమ్ హ్యాండ్ ఉన్న సినిమాలకు ఒకలా డేట్లు ఇస్తోన్న పవన్… ఆయనకు సంబంధం లేని సినిమాలకు డేట్లు ఇచ్చే విషయంలో శీతకన్ను వేస్తున్నాడంటున్నారు. నిజం చెప్పాలంటే పవన్‌ను నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు క్రిష్, హరీష్‌శంకర్.
హరిహర భారీ బడ్జెట్ సినిమా. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు అయ్యింది. వడ్డీలు రోజు రోజుకు తడిసి మోపెడు అవుతున్నాయి. తన బాధను నిర్మాత ఏఎం. రత్నం ఎవ్వరికి చెప్పుకునే పరిస్థితి లేదు. పవన్ డేట్లు తన గుప్పెట్లో పెట్టుకుని త్రివిక్రమ్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని ఇండస్ట్రీ వాళ్లు పీకల్లోతు కోపంతో ఉన్నారు. తనకు నచ్చిన సినిమాలు సెట్ చేసుకుని.. కమీషన్లు తీసుకుంటూ.. తన హ్యాండ్ లేని హరిహర, ఉస్తాద్ భగత్‌సింగ్‌కు తీరని అన్యాయం చేస్తున్నాడని అంటున్నారు.
పవన్ అయినా ఈ విషయంలో త్రివిక్రమ్‌ను సైడ్ చేయకపోతే పవన్ సినీ కెరీర్ సంకనాకి పోవడం ఖాయం. పవన్‌తో సినిమాలు చేసేందుకు, తీసేందుకు దర్శక నిర్మాతలు ఆయన దగ్గరకు రారు.