Moviesచిరంజీవి పెట్టుకున్న ఈ వాచ్ ఆయనకి ఎవరిచ్చారో తెలిస్తే షాక్ అయిపోతారు.....

చిరంజీవి పెట్టుకున్న ఈ వాచ్ ఆయనకి ఎవరిచ్చారో తెలిస్తే షాక్ అయిపోతారు.. అంత స్పెషలా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ వాడే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి . గతంలో సోషల్ మీడియా రానప్పుడు స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి దుస్తులు వేసుకునే వాళ్ళు.. ఏ బ్రాండెడ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ వాడేవాళ్లు.. వాటి కాస్ట్ ఎంత అని తెలుసుకోవడానికి జనాలు తహతలాడిపోయేవాళ్ళు . కాగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీస్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది . వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడతారు అన్న విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతున్నాయి.

ఇలాంటి క్రమంలోనే సెలబ్రిటీస్ ఇంత కాస్ట్లీ రిచెస్ట్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు . కాగా ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్.. యాక్సెసరీస్.. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ గురించి వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే . కాగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ధరించిన వాచ్ దానికున్న స్పెషాలిటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా మెగా హీరోకి ఈ వాచ్ గిఫ్ట్ చేసిన వ్యక్తి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని కార్యక్రమాలకు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు . ఈ క్రమంలోనే మెగాస్టార్ వాచ్ పై అందరి దృష్టి పడింది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కామన్ గా ఓ వాచ్ ని ధరిస్తూ కనిపిస్తున్నాడు . దీంతో చిరంజీవి ధరించిన ఆ వాచ్ ధర ఎంత..? దాన్ని స్పెషాలిటీ ఏంటి..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . కాగా చిరంజీవి కి వాచ్ ల పిచ్చి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే .

ఎక్కడికి వెళ్ళినా సరే మరి ముఖ్యంగా వాచీలు కొనుక్కుంటూ ఉంటారట . రకరకాల గడియారాలను వాడడం చిరంజీవికి చిన్నప్పటి నుంచి అలవాటుగా వస్తుందట. రీసెంట్గా చిరంజీవి పెట్టుకున్న రోలెక్స్ వాచ్ కాస్త స్టైలిష్ గా డిఫరెంట్ గా అనిపించడంతో అందరి కళ్ళు దానిపై పడ్డాయి . ఈ వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటా నా వైట్ టైగర్. ఈ వాచ్ ధర అక్షరాల కోటి 90 లక్షలు 91 వేయీ అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ వాచ్ చాలా స్పెషల్ . ఈ వాచ్ లో తయారు చేయబడ్డ ముళ్ళు అన్ని చాలా ఫ్రేర్ పీసెస్ తో చేయబడినవట . అంతేకాదు ఈ వాచెస్ చాలా రేర్ గా ఉంటాయని .. ఇప్పటివరకు ఇలాంటి వాచెస్ పది మంది దగ్గరే ఉన్నాయని ..వాళ్లలో ఒకరే చిరంజీవి అంటూ తెలుస్తుంది. ఈ వాచ్ ని చిరంజీవి కి గిఫ్ట్ చేసింది ఎవరో కాదు.. కొడుకు రామ్ చరణ్ ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news