టాలీవుడ్‌లో చిరంజీవి, బాలయ్య సినిమాలు సంక్రాంతికి పోటీ పడితే ఎలా ఉంటుందో ? చెప్పక్కర్లేదు. వీరిద్దరు తమ సినిమాలతో ఎప్పుడు పోటీపడినా కూడా బాక్సాఫీస్ హీటెక్కిపోతుంది. చాలా చాలా యేళ్ల తర్వాత 2017 సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన 150, 100వ సినిమాలతో సంక్రాంతికి వచ్చారు. చిరు ఖైదీ 150 సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తే, పేరు మాత్రం బాలయ్య శాతకర్ణి సినిమాకే వచ్చింది.
మళ్లీ ఐదేళ్లకు ఈ సంక్రాంతి కానుకగా చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇద్దరూ గెలిచారు. రెండు సినిమాలు సూపర్ హిట్. అయితే చిరు సినిమాలో రవితేజ ఉండడంతో పాటు మల్టీస్టారర్ కావడంతో ఆ సినిమాకే కలెక్షన్ల పరంగా ఎడ్జ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ యేడాదిలోనే మరోసారి చిరు, బాలయ్య సమరం షురూ కానుంది.
మరో పండగకు వీరిద్దరు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. వాస్తవంగా డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సిన వీరసింహారెడ్డిని బాలయ్య కావాలనే సంక్రాంతి బరిలో దించారని అన్నారు. అయితే చిరు ఈ సమ్మర్‌కు రావాల్సిన తన భోళాశంకర్ సినిమాను దసరా బరిలో దించాలని పట్టుబట్టారట. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు. ఇది కూడా కోలీవుడ్ వేదాళం సినిమాకు రీమేక్‌గానే వస్తోంది.
అయితే బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాను దసరా టార్గెట్‌గా రిలీజ్ చేయాలని షూటింగ్ చేస్తున్నారు. భోళాశంకర్ సమ్మర్‌కు అనుకున్నా కావాలనే చిరు దసరాకు వేయించేలా ప్లాన్ చేశారట. వాల్తేరు వీరయ్య విజయం ఇచ్చిన ధీమాతోనే మరోసారి బాలయ్యతో పోటీ పడాలని చిరు ఆలోచనగా ఉందన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మరోసారి ఈ ఇద్దరు హీరోలు దసరాకు తమ సినిమాలతో పోటీ పడితే ఈ సారి ఎవరిది పై చేయి ఉంటుందో ? చూడాలి. ఇక దసరాకే పవన్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు, మహేష్‌బాబు, త్రివిక్రమ్ సినిమా కూడా లైన్లో ఉందంటున్నారు.