సినిమా ఇండస్ట్రీలో చీటింగ్ చేయడం .. నమ్మించి మోసం చేయడం చాలా కామన్ .. ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే ..అలర్ట్ గా లేకపోతే ముంచేస్తుంటారు.. కొన్నిసార్లు నమ్మిన స్నేహితుడే ముంచేస్తూ ఉండడం మనం చూస్తున్నాం . ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలను, డైరెక్టర్స్ ని , హీరోయిన్స్ ని డబ్బుల పేరుతో నమ్మించి .. స్నేహం పేరుతో చీట్ చేసిన వాళ్ళున్నారు .
కాగా ఎన్టీఆర్‌ని అదే తరహాలో తన ఫ్రెండ్ అంటూ చెప్పుకునే ఓ వ్యక్తి ముంచేసాడు అంటూ వార్తలుగతంలో వార్తలు వినిపించాయి . ఎన్టీఆర్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో అందరికీ తెలిసిందే. పేరుకి నందమూరి హీరో అయినా .. సొంత టాలెంట్ తో కష్టపడి సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు . అయితేకెరీర్ పరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క రూపాయి సంపాదిస్తూ దాచి పెడుతూ వచ్చిన తారక్.. ఒకానొక టైంలో సినిమాలన్నీ డిజాస్టర్ గా మారాయి. డబ్బులకు టైట్ అయిపోయిందట.
ఆ టైంలో ఒక హిట్ కొట్టడానికి నానాతంటాలు పట్టాడు. అయితే అలాంటి టైం లోనే తారక్ పక్కనే అంటూ జాన్ జిగిడి దోస్త్ గా పేరు సంపాదించుకున్న ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అయిన పెద్దమనిషి తారక్ కెరియర్ అయిపోయిందని.. డాన్స్ లు చేయలేకపోతున్నాడని.. అతగాడితో సినిమాలు తీయడం వేస్ట్ అంటూ ప్రచారం చేశారట. ఈ క్రమంలోనే పలువురు డైరెక్టర్స్ కూడా తారక్ గురించి నెగటివ్‌గా మాట్లాడుకున్నారు . అయితే రాజమౌళి పుణ్యమా అంటూ తన బాడీని తగ్గించుకున్న ఎన్టీఆర్ .. ఆ తర్వాత వరుసగా బడా బడా సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తీస్తున్నాడు. అయితే పక్కనే ఉంటూ ఎన్టీఆర్ ని చీట్ చేసిన వ్యక్తిని ఆయన దూరం పెడుతూ వచ్చాడే కానీ నిందించలేదు ..తతప్పు చేసిన క్షమించే గుణం నందమూరి ఫ్యామిలీకి ఉంది అంటూ మరోసారి ప్రూవ్ చేసాడు తారక్..!!