సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని హీరోలు వాడుకోవడం సర్వ సాధారణం. అసలు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే కొందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ను సుఖ పెట్టాల్సిందే అన్న కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఎస్ అది నిజమే అంటూ స్టార్ హీరోయిన్స్ కూడా చెప్పుకు రావడం గమనార్హం. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి జయం సినిమాతో వచ్చి ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సదా .. గతంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.
జయం సినిమా హిట్ అయిన తర్వాత సద రేంజ్ క్రేజ్ మారిపోయింది . కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది . అయితే కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో అపరచితుడు సినిమాతో తన ఫేమ్ మొత్తం మారిపోయింది. ఈ సినిమాలో విక్రమ్ సరసన సదా హీరోయిన్గా నటించింది. తెర పై వీళ్ల కెమిస్ట్రి అద్దిరిపోయింది . మరి ముఖ్యంగా రెమో క్యారెక్టర్ లో విక్రమ్ చేసిన హాట్ రొమాన్స్.. అపరిచితుడుగా భయపెట్టిన భయం రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంది .
అయితే ఈ సినిమా షూటింగ్లో విక్రమ్ ప్రవర్తన సదా కు ఇబ్బందికరంగా అనిపించిందట . “షాట్ రెడీ అనగానే ఒక్కసారిగా ఆ మూడ్ లోకి వెళ్లిపోతారని.. తెరపై హాట్ రొమాన్స్ చేస్తాడు అని.. ఎప్పుడైతే డైరెక్టర్ కట్ కట్ అంటాడో అప్పుడు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి ..నన్ను సిస్టర్ అంటారని .. రొమాన్స్ చేసి సిస్టర్ అంటే చిరాకు వచ్చేది అని” సదా గతంలో పాల్గొన్న ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది .
దీంతో అప్పట్లో కోలీవుడ్మీడియాలోనూ సదాకు విక్రమ్ కు మధ్య ఏదో సంబంధం ఉందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే సదా మా మధ్య అలాంటిది ఏదీ లేదని.. మేము మంచి ఫ్రెండ్స్ గా ఉన్నామని తెరపై మాత్రమే అలా నటించామని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సదా..మంచి అవకాశాలతో దూసుకుపోతుంది ..!!